గల్వాన్ ఘర్షణ: మరో వీడియో రిలీజ్.. డిస్కషన్స్ వేళ హాట్ టాపిక్
గల్వాన్ ఘర్షణకు సంబంధించి మరో వీడియో బయటకు వచ్చింది. సరిహద్దులో నెలకొన్న సమస్యల పరిష్కరం కోసం భారత్-చైనా ఆర్మీ అధికారుల పన్నెండో విడత సైనిక చర్చలు ఇటీవల జరిగింది. డిస్కషన్ చేసిన సోమవారం రోజున చైనా అధికారిక ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ సీజీటీఎన్, ట్విట్టర్ హ్యాండిల్, వెబ్ సైట్ లో గల్వాన్ ఘర్షణల వీడియోని విడుదల చేసింది. 45 సెకన్ల నిడివి గల వీడియోలో దృశ్యాలు గతేడాది భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించినవేనని అందులో పేర్కొన్నారు.
వీడియోలో భారత సైనికులపైకి.. చైనా సైనికులు రాళ్లు రువ్వడం, గల్వాన్ నదిని దాటేందుకు పీఎల్ఏ సైన్యం ప్రయత్నించడం కనిపిస్తోంది. ఘర్షణలో మరణించిన పీఎల్ఏ సైనికుల కుటుంబ సభ్యుల ఇంటర్వ్యూకి సంబంధించిన దృశ్యాలు సైతం అందులో ఉన్నాయి. సైన్యం సహాయక చర్యల దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. గతంలో గల్వాన్ ఘర్షణకు సంబంధించి చైనా ఓ ఫేక్ వీడియోను విడుదల చేసి.. భారత సైన్యమే దాడికి పాల్పడిందని చెప్పుకురావడం, ఆ వాదనను భారత అధికారులు కొట్టిపారేసిన విషయం తెలిసిందే.

గతేడాది జూన్ నెలలో గల్వాన్ వ్యాలీలో భారత్-చైనా సైన్యాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులు కాగా, రెట్టింపు సంఖ్యలో చైనా సైనికులు చనిపోయారు. చైనా మాత్రం ప్రాణనష్టంపై వివరాలను దాచిపెడుతోంది. తొలుత ఎవరూ చనిపోలేదని బుకాయించి.. ఆ తర్వాత నలుగురు మాత్రమే మరణించారని ప్రకటించింది. అప్పటి నుంచి సరిహద్దులో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది.
Recommended Video
దఫాలుగా చర్చించిన తర్వాత ఫిబ్రవరిలో సైనిక ఉపసంహరణకు ఇరుదేశాలు అంగీకారానికి వచ్చాయి. ఫలితంగా పాంగాంగ్ ఉత్తర, దక్షిణ తీరాల్లో మోహరించిన సైన్యాన్ని ఇరుదేశాలు విత్ డ్రా చేసుకున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణపై భారత్-చైనా సైన్యాలు జులై 31న 12వ విడత చర్చలు జరిపాయి.












Click it and Unblock the Notifications