మనవడితో 50 ఏళ్ల మహిళ వివాహం.. సినిమాకు మించిన ట్విస్టులు బాబోయ్

ఉత్తర్ ప్రదేశ్ లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళ తన భర్తను, నలుగురు పిల్లల్ని కాదని మనవడి వయసున్న ఓ యువకుడిని పెళ్లి చేసుకుంది. 30 ఏళ్ల వయసున్న ఆ యువకుడిని 50 ఏళ్ల ఆ మహిళ వివాహం చేసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ వార్త సంచలనంగా మారింది. ఈ కథలో ట్విస్టులు కూడా టన్నుల కొద్దీ ఉన్నాయి. సినిమాకు మించిన ట్విస్టులతో బుర్రను హీటెక్కించిందీ కథనం. ఉత్తరప్రదేశ్ లోని అంబేద్కర్ నగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

అంబేద్కర్ నగర్ జిల్లాకు చెందిన ఇంద్రావతి అనే మహిళకు భర్త, నలుగురు సంతానం ఉన్నారు. వీరిలో ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వీళ్లందరినీ కాదని.. మనవడి వరసైన ఆజాద్ అనే యువకుడిని ఆమె పెళ్లి చేసుకుంది. వీరి వివాహం ఓ గుడిలో జరిగింది. పెళ్లి తర్వాత తన కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయింది ఇంద్రావతి. ఆజాద్ - ఇంద్రావతి ముందుగా గోవింద్ సాహిబ్ గుడికి వెళ్లి.. అక్కడ నుదుటికి బొట్టు పెట్టుకున్నారు. అగ్ని గుండం చుట్టూ ఒకరి చేతిని మరొకటి పట్టుకుని ఏడు అడుగులు వేశారు. ఆ తర్వాత గ్రామం నుంచి వెళ్లిపోయారు.

ఇంద్రావతి, ఆజాద్ ఓకే ప్రాంతంలో నివసించేవారు. మొదట వారి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారిందని గ్రామస్థులు అంటున్నారు. మొదట్లో ఇద్దరు బంధువుల లాగానే ఉన్నారని.. ఆ తర్వాత వారి మధ్య క్రమంగా ప్రేమ మొదలైందని స్థానికులు చెబుతున్నారు. ప్రేమ తర్వాత వారిద్దరు తరచుగా కలుసుకునేవారని తెలుస్తోంది. అయితే వీరిద్దరూ వరుసకు బంధువులు కావడంతో.. కుటుంబ సభ్యులు కూడా పెద్దగా అనుమానించేవారు కాదట.

అయితే ఇంద్రావతి, ఆజాద్ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరినీ ఓసారి ఇంద్రావతి భర్త చంద్రశేఖర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న వ్యవహారం అందరికీ తెలిసింది. ఇంద్రావతికి చంద్రశేఖర్ చాలా సార్లు ప్రవర్తన మార్చుకోమని నచ్చజెప్పినప్పటికీ.. ఆమె పట్టించుకోలేదు. దీంతో ఆయన చేసేదేంలేక పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. అయితే ఇద్దరూ మేజర్లు కావడంతో ఫిర్యాదు స్వీకరించేందుకు నిరాకరించారు.

Unusual Union 50-Year-Old Woman Marries Grandson in Uttar Pradesh

మరోవైపు తమ వ్యవహారానికి అడ్డుగా ఉన్న చంద్రశేఖర్ ను చంపేందుకు ప్లాన్ వేశారు ఆజాద్- ఇంద్రావతి. ఆఖరికి పిల్లలకు కూడా విషం ఇచ్చి చంపేయాలని పన్నాగం పన్నారు. అయితే ఈ విషయం చంద్రశేఖర్ గ్రహించాడు. నిలదీయగా అదేం లేదని మాట మార్చిందట.

మరోవైపు చంద్రశేఖర్ కు ఇంద్రావతి రెండో భార్య. చంద్రశేఖర్ వృత్తి రీత్యా తరచూ క్యాంపులకు వెళ్లేవాడు. దీనిని అదునుగా చేసుకున్న ఇంద్రావతి ఆజాద్ తో మరింత దగ్గరయింది. అయితే తాజాగా ఇంద్రావతి ఆజాద్ ను వివాహం చేసుకుంది. తన భార్య ఆజాద్ ను వివాహం చేసుకుని వెల్లిపోవడంతో చంద్రశేఖర్, పిల్లలు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+