ముసలోడే కానీ మహానుభావుడు.. 30 ఏళ్ల మహిళను లవ్ మ్యారేజ్ చేసుకున్న 75 ఏళ్ల వృద్ధుడు..

ప్రేమకు.. పెళ్లికి ఏజ్ అడ్డు రాదని నిరూపించాడు ఆ వృద్ధుడు. కృష్ణా రామా అనుకోవాల్సిన వయసులో 30 ఏళ్ల మహిళను ప్రేమించాడు. వృద్ధుడి ప్రేమను ఆమె అంగీకరించింది. దాంతో ఇరువురూ సంవత్సరం పాటు ప్రేమించుకున్నారు. ఇప్పుడు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నారు. తాజాగా వారి ఎంగేజ్ మెంట్ పూర్తయింది. నవరాత్రి తర్వాత పెళ్లి జరగనుంది. అయితే ఈ అంశం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఆ జంటకు సపోర్ట్ గా కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు విమర్శిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని ఔరాయాలో జరిగింది.

స్థానిక కథనాల ప్రకారం.. ఔరాయాకు చెందిన రామ్ సుగార్ వయసు 75 ఏళ్లు. ఆయన తన ప్రాంతానికే చెందిన 30 ఏళ్ల రాణి రాజ్ పుత్ ను వివాహం చేసుకోబోతున్నాడు. ఇరువురూ సంవత్సరం కాలంగా ప్రేమించుకుంటున్నారు. తాజాగా వారి ఎంగేజ్ మెంట్ పూర్తికాగా.. నవరాత్రి తర్వాత పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే రాణి ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఉంటుంది. రామ్ సుగార్ కుమార్తెను కలిసేందుకు తరచూ అతని ఇంటికి వెళ్తుంటుంది. ఈ క్రమంలో రామ్ సుగార్- రాణిల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అలా వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. అలా వారి ప్రేమ.. పెళ్లి వరకూ వచ్చింది. ఇక తాజాగా వీరి ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

UP A 30-year-old woman falls in love with a 75-year-old man marriage fixed shocking incident in UP

ఈ వీడియోలో రామ్ సుగార్- రాణి ఇద్దరూ సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. వారి చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులు కూడా సంతోషంగానే ఉన్నట్లు వీడియోలో స్పష్టం అవుతోంది. ఇక వీరిద్దరి మధ్య దాదాపు 45 సంవత్సరాలు గ్యాప్ ఉన్న క్రమంలో వీరి స్టోరీ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ అంశంపై నెటిజన్లు పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొత్త దంపతులకు శుభాకాంక్షలు అని ఓ యూజర్ కామెంట్ చేయగా.. అతను రామ్ సుగర్ కాదు.. షుగర్ డాడీ అని మరో యూజర్ కామెంట్ పెట్టాడు. మరో యూజర్ ప్రేమ నిజంగా గుడ్డిదా..? అని కామెంట్ పెట్టాడు. మరో యూజర్ మాట్లాడుతూ.. ఆ ముసలివాడికి ఎంత ప్రాపర్టీ ఉందో.. అని కామెంట్ చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+