సంపర్క్ ఫర్ సమర్థన్: సంజయ్ దత్‌ను కలిసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
లక్నో: సంపర్క్ ఫర్ సమర్థన్‌లో భాగంగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ను కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నాలుగేళ్ల సాధించిన విజయాలకు సంబంధించిన పుస్తకాన్ని అందించారు.
నరేంద్ర మోడీ నాలుగేళ్లలో సాధించిన విజయాలను ప్రముఖుల వద్దకు తీసుకువెళ్లి వారి మద్దతు కూడగట్టేందుకు బీజేపీ సంపర్క్ ఫర్ సమర్థన్ ప్రచారాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రముఖ ఫిలిం నటుడు, స్క్రీన్ రైటర్ సలీమ్ ఖాన్‌ను కలిశారు. ఆ సమయంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా ఉన్నారు.
బీజేపీ మే 29వ తేదీన సమర్థన్ ఫర్ సంపర్క్ ప్రచారాన్ని ప్రారంభించింది. తొలుత బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్‌ను గురుగ్రాంలోను ఆయన నివాసంలో కలిశారు.
ఆ తర్వాత అమిత్ షా ముంబైలో బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే తదితరులను కలిశారు. ఇందులో భాగంగా వారు మోడీ నాలుగేళ్ల పాలనలోని విజయాలకు చెందిన పుస్తకాలు అందిస్తున్నారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications