నడుస్తున్న రైళ్ళోనే పెళ్ళి: పురోహితుడిగా పండిట్ రవిశంకర్
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో అరుదైన వివాహం జరిగింది. కదులుతున్న రైలులో వివాహం జరిగింది. ఈ వివాహనికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ పురోహితుడిగా వ్యవహరించడం విశేషం.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కౌశాంబి జిల్లా ఉధిన్ ఖుర్ద్ గ్రామానికి చెందిన సచిన్ ఫార్మాసిస్ట్. జ్యోత్స్న సింగ్ పటేల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగి. వీరిద్దరూ తమ వివాహాన్ని నిరాడంబరంగా, వినూత్నంగా చేసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం లక్నో-గోరఖ్‌పూర్ రైలును ఎంచుకున్నారు. రైలు ప్రయాణిస్తుండగా ఇద్దరూ వివాహం చేసుకున్నారు. అదే రైలులో ఉత్తరప్రదేశ్ యాత్రకు బయలుదేరిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ పురోహితుడిగా వ్యవహరించి వీరి వివాహాన్ని దగ్గరుండి జరిపించారు.

పెళ్లిళ్లు ఇలానే నిరాడంబరంగా చేసుకోవాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు పండిట్ రవిశంకర్ పిలుపునిచ్చారు. నిరాడంబరంగా వివాహలు చేసుకోవడం వల్ల అప్పులు చేయాల్సిన అవసరం రాదని ఆయన అభిప్రాయపడ్డారు.
కొత్త జంట ఏప్రిల్‌లో వివాహం చేసుకోవాల్సి ఉంది. అయితే రవిశంకర్ వస్తున్నారని తెలిసి, ఆయన సమక్షంలో వివాహం చేసుకోవాలని కొత్త జంట భావించారని రైల్వే తెలిపింది. అందుకోసమే వివాహన్ని ముందుకు జరుపుకున్నారని పేర్కొంది. రైలు బోగీలో పెళ్లి జరగడం బహుశా ఇదే తొలిసారని వివాహానికి హాజరైన ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు.












Click it and Unblock the Notifications