UP Elections 2022: సమాజ్‌వాదీ పార్టీ గూండారాజ్ ను ప్రజలు అంగీకరించరు; ఎన్నికల ప్రచారంలో పీఎం మోడీ
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రెండవ దశ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఉత్తరప్రదేశ్ ప్రజలు ప్రధాన ప్రతిపక్షమైన ఎస్పీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. తమ 'గుండా రాజ్'ని అంగీకరించరని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి)పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

యూపీలో కుటుంబ రాజకీయాలు చెల్లవు.. ఎస్పీ గూండా రాజ్ ను అంగీకరించరు
యుపిలోని కస్‌గంజ్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని, ఎస్‌పి వంశపారంపర్య రాజకీయాలకు పాల్పడుతోందని, ఆ పార్టీ నేతలను బంధుప్రీతి ఉన్న నాయకులను విమర్శించారు. కుటుంబ రాజకీయాలు యూపీలో చెల్లవని ఆయన పేర్కొన్నారు. కుటుంబ రాజకీయాల వల్ల ప్రజలు ఓట్లు వేయలేదని గుర్తించారని, అందుకే వారు ఈవీఎంలను మరియు ఎన్నికల కమిషన్‌ను నిందించడం ప్రారంభించారని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. అసలు విషయం ఏమిటంటే యూపీ ప్రజలు సమాజ్వాదీ పార్టీ నాయకులను , వారి 'గుండా రాజ్' పాలనను అంగీకరించడానికి సిద్ధంగా లేరు," ప్రధాన మంత్రి అని మోదీ అన్నారు.

లతా మంగేష్కర్ అకాడమీ ఏర్పాటుపై సీఎం యోగీని అభినందించిన మోడీ
ఇదే సమయంలో ఇటీవల మరణించిన ప్రముఖ గాయని లతా మంగేష్కర్ పేరిట ఫిల్మ్ సిటీలో మ్యూజిక్ అకాడమీని ఏర్పాటు చేసినందుకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ప్రధాని మోదీ అభినందించారు. అయోధ్యలో భారతరత్న గాయని లతా మంగేష్కర్ పేరు మీద 'చౌక్'. ఫిల్మ్ సిటీలో సంగీతం కోసం లతా మంగేష్కర్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నందుకు నేను సిఎం యోగిని అభినందిస్తున్నాను" అని ప్రధాని తన ఎన్నికల ర్యాలీలో అన్నారు.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 14న రెండో దశ పోలింగ్
గురువారం ఓటింగ్ జరిగిన ఉత్తరప్రదేశ్‌లోని 11 జిల్లాల్లో సాయంత్రం 6 గంటల వరకు 60.17 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్‌లో గురువారం నుంచి ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు మొదలు కాగా, చివరి దశ పోలింగ్ మార్చి 7న నిర్వహించనున్నారు. ఫలితాలు మార్చి 10న ప్రకటించనున్నట్లు భారత ఎన్నికల సంఘం తెలిపింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి రెండో దశ పోలింగ్ ఫిబ్రవరి 14న జరగనుంది. రెండో దశలో 55 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 586 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు, ఇందులో తొమ్మిది షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడిన నియోజకవర్గాలుగా తెలుస్తుంది. రిజర్వ్ చేయబడిన స్థానాల్లో సహారన్‌పూర్, బిజ్నోర్, అమ్రోహా (జెపి నగర్), మొరాదాబాద్, బరేలీ, రాంపూర్, సంభాల్ (భీమ్ నగర్), బుదౌన్ మరియు షాజహాన్‌పూర్ ఉన్నాయి.












Click it and Unblock the Notifications