UP Elections 2022: ఎస్పీ కోసం మమతాబెనర్జీ, అఖిలేష్‌తో కలిసి వర్చువల్ ర్యాలీ; బీజేపీని ఓడించాలని పిలుపు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) అధినేత్రి మమతా బెనర్జీ వచ్చే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంగళవారం సమాజ్ వాదీ పార్టీ తరపున ప్రచారం చేయనున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మమతా బెనర్జీ సోమవారం లక్నో చేరుకున్నారు. బిజెపిని ఓడించాలని సమాజ్వాదీ పార్టీ తరఫున మమతా బెనర్జీ ప్రచారం చేయనున్నారు. సోమవారం లక్నోలోని అమౌసి విమానాశ్రయంలో అఖిలేష్ యాదవ్ మమతా బెనర్జీకి స్వాగతం పలికి ఈ సమాచారాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నారు.
Recommended Video

యూపీలో ఎస్పీకి మద్దతుగా వర్చువల్ ర్యాలీలో పాల్గొననున్న మమతా బెనర్జీ
మంగళవారం లక్నోలోని పార్టీ కార్యాలయంలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో కలిసి మమతా బెనర్జీ సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రసంగించనున్నారు. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ వర్చువల్ ర్యాలీలో కూడా ప్రసంగించనున్నారు. ఈ ఎన్నికలలో బీజేపీ ఓడించడమే లక్ష్యంగా రంగంలోకి దిగిన మమతాబెనర్జీ సమాజ్వాది పార్టీ ని గెలిపించాలని ఉత్తరప్రదేశ్లో ప్రచారం నిర్వహించనున్నారు.

బీజేపీని ఓడించాలని మమత పిలుపు
లక్నోకు బయలుదేరే ముందు, కోల్‌కతాలో మమతా బెనర్జీ వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి)ని ఓడించాలని పిలుపునిచ్చారు. ఎస్పీ తరపున ప్రచారం చేసేందుకు అఖిలేష్ యాదవ్ తనను ఆహ్వానించారని ఆమె తెలిపారు.తాను వెళ్తున్నట్టు పేర్కొన్నారు. ఫిబ్రవరిలోనే ఆమె వారణాసిలో పర్యటించనున్నట్టు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. అయితే తేదీ ఇంకా నిర్ణయించబడలేదు.

యుపిలో కూడా బీజేపీని ఓడిస్తామని, ఇది దీదీకి వాగ్దానమన్న అఖిలేష్ యాదవ్
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో టీఎంసీ పోటీ చేయదని, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అభ్యర్థులను బరిలోకి దింపుతుందని మమతా బెనర్జీ తెలియజేశారు. తాము పశ్చిమ బెంగాల్‌లో కలిసి ఓడించామని , ఇప్పుడు తాము యుపిలో కూడా ఓడిస్తామని, ఇది దీదీకి వాగ్దానమని పేర్కొన్న అఖిలేష్ యాదవ్ తాము ఈ ఎన్నికల్లో విజేతలుగా ఎదుగుతామన్నారు. యుపిలో దీదీకి హృదయపూర్వక స్వాగతం మరియు శుభాకాంక్షలు అని మమతా బెనర్జీతో ఉన్న ఫోటోను పంచుకుంటూ ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు.

టీఎంసీ, సమాజ్ వాదీ పార్టీ ఒకరికోసం ఒకరు.. గత ఎన్నికల్లోనూ సహకారం
సమాజ్ వాదీ పార్టీ కోసం మమతా బెనర్జీ లక్నో రావడం ఇదే మొదటిసారి కాదు. 2017 యుపి అసెంబ్లీ ఎన్నికలకు ముందు, మమతా బెనర్జీ నగరంలోని 1090 క్రాసింగ్ వద్ద నోట్ల రద్దు వ్యతిరేక బహిరంగ సభ నిర్వహించినప్పుడు ఎస్పీకి మద్దతుగా వచ్చారు. అప్పుడు యూపీ ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ ఉన్నారు. ఆయన 2016 మరియు 2011 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీకి మరియు టీఎంసీకి మద్దతు ప్రకటించారు .
2021లో, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఎంసీ కోసం ప్రచారం చేయడానికి అఖిలేష్ యాదవ్ ఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడు కిరణ్మయ్ నందా మరియు ఎస్పీ రాజ్యసభ సభ్యుడు జయ బచ్చన్‌లను పంపారు. 403 మంది సభ్యులున్న ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.












Click it and Unblock the Notifications