Chandrayaan 3 : శాస్త్రవేత్తలు భూమికి తిరిగొస్తే ఘనస్వాగతం-యూపీ ఎమ్మెల్యే కామెంట్స్ వైరల్ ..
చంద్రుడి రహస్యాలు ఛేదించేందుకు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ అయింది. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ కావడంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటే రాజకీయ నేతల గందరగోళ వ్యాఖ్యలు కూడా మొదలయ్యాయి. చంద్రయాన్ 3 సక్సెస్ ను తమ ఖాతాల్లో వేసుకునేందుకు కొందరు నేతలు ప్రయత్నిస్తుంటే మరికొందరు చంద్రయాన్ శాస్త్రవేత్తలపై విచిత్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇదే క్రమంలో యూపీకి చెందిన ఎస్బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కూడా అయిన ఓపీ రాజ్ భర్ తాజాగా చంద్రయాన్ 3 సక్సెస్ పై ఓ విచిత్ర ప్రకటన చేశారు. ఇందులో ఆయన చంద్రయాన్ 3 సక్సెస్ ను అభినందిస్తూనే, అందుకు కారణమైన శాస్త్రవేత్తలపై తనదైన శైలిలో రెచ్చిపోయారు. దీంతో ఇప్పుడు రాజ్ భర్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఓ ప్రజాప్రతినిధి అయి ఉండి ఈ మాత్రం జ్ఞానం లేకుండా అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.

ఇంతకీ ఓపీ రాజ్ భర్ ఏమన్నాడో తెలుసా.. ? "భారత శాస్త్రవేత్తలు వారి కృషి మరియు పరిశోధనలకు ధన్యవాదాలు. చంద్రయాన్-3తో సాధించిన విజయానికి నేను వారిని అభినందిస్తున్నాను. రేపు వారు సురక్షితంగా భూమికి తిరిగి వచ్చిన తర్వాత, దేశం మొత్తం వారిని స్వాగతించాలి" అని రాజ్‌భర్ అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు విన్న వారంతా నవ్వు ఆపుకోలేకపోతున్నారు. మరికొందరు సోషల్ మీడియాలో వీటిని షేర్ చేస్తున్నారు.
వాస్తవానికి చంద్రయాన్-3 మానవ సహిత మిషన్ కాదు. ఇది మానవ రహిత అంతరిక్ష నౌక. ఇది చంద్రుని ఉపరితలం, వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి రూపొందించారు. అలాగే విమానంలో వ్యోమగాములూ లేరు. దీంతో రాజ్‌భర్ ప్రకటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు నవ్వుకుంటున్నారు. చాలా మంది దీనిని "గాఫ్" అని పిలిచారు, అయితే కొందరు అతనికి మిషన్ గురించి తెలియదని విమర్శలు గుప్పిస్తున్నారు. రాజ్ భర్ తరహాలోనే దేశంలోని మరికొందరు ప్రజాప్రతినిధులు గూడా గందరగోళ వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications