వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘరానా మోసం.. 7లక్షల మంది బురిడీ.. 3700కోట్లు దోచుకున్న సంస్థ

కంపెనీ మోసాన్ని గుర్తించలేక సుమారు ఏడు లక్షల మంది ఖాతాదారులు ఒక్కొక్కరు రూ.57,500 చెల్లించారు.

|
Google Oneindia TeluguNews

లక్నో: నోయిడాలోని అబ్లేజ్‌ ఇన్ఫో సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ కంపెనీ సుమారు ఏడు లక్షల మందిని బురిడీ కొట్టించింది. ఆన్ లైన్ ద్వారా సులువుగా డబ్బులు సంపాదించవచ్చని లక్షల మందికి ఆశజూపిన సంస్థ.. వారందరితో డబ్బులు కట్టించుకుని మోసానికి పాల్పడింది.

అబ్లేజ్‌ ఇన్ఫో సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ కంపెనీకి అనుబంధంగా తమ సంస్థ వెబ్ పోర్టల్స్ నిర్వహిస్తోందని.. వాటిల్లో సభ్యులుగా చేరితే ఒక్కో క్లిక్ కు రూ.5 సంపాదించవచ్చంటూ చాలామందికి గాలం వేసింది. ఖాతాదారులుగా చేరేందుకు రూ.57,500 రుసుం చెల్లించాలని, ఇదే వారి పెట్టుబడి అని తెలిపింది.

 UP Police Unearth Rs 3,700 Cr Online Fraud Involving 7 Lakh People, 3 Held

కంపెనీ మోసాన్ని గుర్తించలేక సుమారు ఏడు లక్షల మంది ఖాతాదారులు ఒక్కొక్కరు రూ.57,500 చెల్లించారు. అనంతరం ప్లేటు ఫిరాయించిన కంపెనీ ఖాతాదారులను మోసం చేసింది. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో వారు దర్యాప్తు చేపట్టారు. కంపెనీ ప్రతినిధులు ఖాతాదారుల నుంచి రూ.3700కోట్లను పెట్టుబడిగా వసూలు చేశారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ప్రధాన నిందితులు ముగ్గురిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, నిందితులు తరచు కంపెనీ పేరు మారుస్తూ తప్పించుకునే ప్రయత్నం చేశారని, అయినప్పటికీ సమర్ధవంతంగా వారిని పట్టుకోగలిగామని పోలీసులు తెలిపారు.

English summary
UP Special Task Force has unearthed one of the biggest online frauds claimed to be around Rs 3,700 crore which was being run under the guise of online trading.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X