UP polls: 51 మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేసిన బీఎస్పీ అధినేత్రి మాయావతి
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతి తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. రెండో విడత జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు 51 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది.
'ఈరోజు, నేను రెండవ దశ ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం 55 సీట్లలో 51 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నాను. ఈ టిబిన్మే మేము 'హర్ పోలింగ్ బూత్ కో జీతానా హై, బిఎస్పి కో సత్తా మే లానా హై' అనే నినాదాన్ని అందించాము. నేను పార్టీని ఆశిస్తున్నాను. కార్యకర్తలు కష్టపడి పని చేస్తారు, 2007 లాగా బీఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు' అని మాయావతి వార్తా సంస్థ ఏఎన్ఐతో అన్నార

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుండి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరగనుంది.
21నే రెండో జాబితా విడుదల చేసిన బీజేపీ
త్వరలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే రెండో అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ శుక్రవారం విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 85 మంది బీజేపీ అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రాయ్ బరేలి సదర్ ఎమ్మెల్యే అదితి సింగ్ పేరు కూడా ఉంది.
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ బంధువు, ఎమ్మెల్యే హరి ఓమ్ యాదవ్ పేరు కూడా ఈ జాబితాలో ఉంది. ఎస్పీని వీడిన ఆయన బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అదితి సింగ్ సిట్టింగ్ సీట్ రాయ్ బరేలి నుంచి పోటీ చేస్తుండగా, హరి ఓమ్ యాదవ్ సిర్సాగంజ్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
కాగా, రాయ్‌బరేలి అసెంబ్లీ స్థానం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్‌బరేలిలోనే ఉండటం గమనార్హం. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నితిన్ అగర్వాల్ సమాజ్ వాదీ పార్టీని వీడి ఇటీవల బీజేపీలో చేరారు. ఆయన హర్దోయి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
Recommended Video
ఇటీవల బీజేపీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి అసిమ్ అరుణ్ కు కూడా ఈ జాబితాలో చోటు దక్కింది. రిజర్వుడ్ సీట్ అయిన కన్నౌజ్ నుంచి అసిమ్ అరుణ్ పోటీ చేస్తున్నట్లు జాబితా వెల్లడించింది. ఈ రెండో జాబితాలో 15 మంది మహిళలకు చోటు కల్పించడం గమనార్హం.












Click it and Unblock the Notifications