వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీలో అరాచక పాలనకు ముగింపు పలికాం, గూండాలు రెడీ అవుతున్నారు జాగ్రత్త: ప్రధాని మోడీ

|
Google Oneindia TeluguNews

లక్నో: మరికొద్ది వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇప్పటికే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా కేంద్రమంత్రులు, పార్టీ నేతలు విస్తృత ప్రచారం చేస్తుండగా.. సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా తొలిసారి ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీతోపాటు ఇతర ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు.

ఐదేళ్ల క్రితం వరకు అరాచక పాలన సాగింది..: అఖిలేష్ పార్టీపై మోడీ

ఐదేళ్ల క్రితం వరకు అరాచక పాలన సాగింది..: అఖిలేష్ పార్టీపై మోడీ


ఐదేళ్ల క్రితం సమాజ్‌వాదీ పార్టీ పాలనలో కిడ్నాప్‌లు, దోపిడీలు, అల్లర్లు, దొంగతనాలు, మాఫియా అరాచకాలు సాగాయని.. దాన్నుంచి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రాన్ని బయటకు తీసుకొస్తున్నారన్నారు. అఖిలేష్ పార్టీ హయాంలో ప్రభుత్వ అండతో బలవంతులు, అల్లరి మూకలు రెచ్చిపోయేవన్నారు. బులందర్‌షహర్, మీరట్ వంటి జిల్లాల్లో వ్యాపారులు తరచూ దోపిడీకి గురయ్యేవారనీ.. బాలికలైతే అసలు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడేవారన్నారు. 2017కి ముందు సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వ హయాంలో పశ్చిమ యూపీలో చోటు చేసుకున్న సంఘటనల్ని అక్కడి ప్రజలు ఎన్నటికీ మరిచిపోలేరన్నారు. పేదలు, దళితులు, అణగారినవర్గాల ప్రజల ఇళ్లు, పొలం, దుకాణాలను దోచుకున్నారని అన్నారు. వలసల గురించి రోజూ వార్తలు వచ్చేవనీ, కిడ్నాప్ లు, వ్యాపారుల నుంచి డబ్బులు డిమాండ్ చేయడం వంటివి అక్కడి ప్రజల జీవితాలను నాశనం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.

యోగి ప్రభుత్వం వచ్చాకే యూపీలో ప్రజలు మహిళలకు రక్షణ: మోడీ

యోగి ప్రభుత్వం వచ్చాకే యూపీలో ప్రజలు మహిళలకు రక్షణ: మోడీ

కానీ, యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి బాలికలకు, వ్యాపారులకు సురక్షిత భావనను కల్పించడంతోపాటు యువత, రైతులకు అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు ప్రధాని మోడీ, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కృషితో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని ప్రభుత్వం వచ్చాక అలాంటి పరిస్థితుల నుంచి యూపీని బయటకు తీసుకొచ్చారని ప్రధాని మోడీ తెలిపారు. రాష్ట్రంలో మార్పు తీసుకొచ్చేందుకు తామెంతో శ్రమిస్తుంటే.. ప్రతిపక్షం మాత్రం ప్రజల ద్వారా బీజేపీపై ప్రతీకారం తీర్చుకునేందుకు చూస్తోందని ఆరోపించారు. ప్రతీకారం తీర్చుకోవడమే వారి సిద్ధాంతమని ప్రధాని ధ్వజమెత్తారు. చట్టానికి అతీతులుగా భావించే మాఫియాలు, గూండాలకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సింహ స్వప్నంగా మారిందనీ, అందుకే ఎలాగైనా యూపీలో అధికారంలోకి రావాలని గూండాలు తహతహ లాడుతున్నారని మండిపడ్డారు.

బీజేపీ ప్రభుత్వం వచ్చాకే యూపీలో అభివృద్ధి, వేలల్లో ఇళ్ల నిర్మాణం

బీజేపీ ప్రభుత్వం వచ్చాకే యూపీలో అభివృద్ధి, వేలల్లో ఇళ్ల నిర్మాణం

బీజేపీ ప్రభుత్వం వచ్చాకే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి ప్రారంభమైందన్నారు. యూపీలో బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం వల్ల పశు సమస్యలను ఎదుర్కోవడంతోపాటు రైతులకు కొత్త ఆదాయ మార్గం ఏర్పడుతుందని ప్రధాని మోడీ అన్నారు. గత ప్రభుత్వం గౌతమ్‌బుద్ధ‌నగర్‌లో ఐదేళ్లలో 73 ఇళ్లు కడితే.. యోగి ప్రభుత్వం 23వేల ఇళ్లు కట్టించి పట్టణ పేదలకు ఇచ్చిందని గుర్తు చేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి బీజేపీని మరోసారి గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. షామ్లీ, ముజఫర్‌నగర్, బాగ్‌పట్ నగరాల్లో సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 800 ఇళ్లు మాత్రమే నిర్మిస్తే.. యోగి ప్రభుత్వం ఈ మూడు నగరాల్లో 33 వేలకుపైగా ఇళ్లు నిర్మించి ఇచ్చిందన్నారు ప్రధాని మోడీ. యూపీలో తొలి విడత ఎన్నికలు ఫిబ్రవరి 10న ప్రారంభం కానుండగా, ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.

English summary
UP Polls 2022: 'Opposition Looking To Seek Revenge From Public', says PM Modi In Virtual Rally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X