UP polls: తొలి దశ ఎన్నికల్లో 60.17 శాతం ఓటింగ్, గతం కంటే తక్కువే, వివరాలు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గురువారం జరిగిన తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 403 మంది సభ్యుల ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో మొదటి దశ గురువారంతో ముగియగా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని జాట్‌ల ఆధిపత్య బెల్ట్‌లో 60.17 శాతం పోలింగ్ నమోదైంది. ఇది 2017లో 63.5% కంటే తక్కువ.
'యూపీ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ విజయవంతంగా పూర్తయింది. మాకు ఎక్కడ ఫిర్యాదులు వచ్చినా వెంటనే EVMలు & VVPATలను మార్చాం. హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోలేదు' అని ఉత్తరప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అజయ్ కుమార్ శుక్లా చెప్పినట్లు ఏఎన్ఐతో పేర్కొన్నారు.
అత్యధిక ఓటింగ్ నమోదైన జిల్లాలు షామ్లీ 66.14 శాతం, ముజఫర్‌నగర్, మధుర వరుసగా 65.32 శాతం 62.90 శాతం. గౌతమ్ బుద్ధ నగర్‌లో రాత్రి 7:55 గంటల వరకు 54.38 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.
గౌతమ్ బుద్ధ నగర్ కాకుండా, అత్యల్పంగా నమోదైన జిల్లాలు ఘజియాబాద్, మీరట్, ఆగ్రా వరుసగా 52.43 శాతం, 60 శాతం, 60.23 శాతం. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రంలోని 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ దశ ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 6 గంటలకు ముగిసిన ఓటింగ్ 623 మంది అభ్యర్థుల ఎన్నికల భవితవ్యాన్ని నిర్ణయించనుంది.

రాష్ట్రంలోని 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ దశ ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 6 గంటలకు ముగిసిన ఓటింగ్ 623 మంది అభ్యర్థుల ఎన్నికల భవితవ్యాన్ని నిర్ణయించనుంది.
నోయిడా అసెంబ్లీ స్థానంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్‌పై సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సునీల్ చౌదరి పోటీ చేశారు. ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ నేత పంఖూరి పాఠక్, బీఎస్పీ నేత కృపరామ్ శర్మ కూడా పోటీలో ఉన్నారు. రాష్ట్ర సరిహద్దులను పోలీసులు మూసివేశారు. ఎన్నికలు జరుగుతున్న 58 నియోజకవర్గాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన నిఘా కొనసాగుతోంది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 14న రెండో దశ పోలింగ్ జరగనుంది. రెండో దశలో 55 అసెంబ్లీ నియోజకవర్గాలకు 586 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు, ఇందులో తొమ్మిది షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడినవి. రిజర్వ్ చేయబడిన స్థానాలలో సహారన్‌పూర్, బిజ్నోర్, అమ్రోహా (JP నగర్), మొరాదాబాద్, బరేలీ, రాంపూర్, సంభాల్ (భీమ్ నగర్), బుదౌన్, షాజహాన్‌పూర్ జిల్లాలు ఉన్నాయి. ఏడు దశల ఎన్నికలు పూర్తయిన తర్వాత మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.












Click it and Unblock the Notifications