వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజల మధ్య బీజేపీ, ఎస్పీలు చిచ్చు.. యూపీలో ప్రియాంక గాంధీ దూకుడు

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. రాజకీయ పార్టీల నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు. రాష్ట్రంలో ఓటర్ల మధ్య చిచ్చురేపడంలో బీజేపీ సమాజ్ వాదీ పార్టీలు ఆరితేరాయని కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ ఆరోపణలు గుప్పించారు. విభజిత రాజకీయాలను ప్రొత్సహించి లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తున్నాయని విరుచుపడ్డారు. అలాంటి పార్టీలను పక్కన పెట్టాలన్నారు. ప్రజలను కులాలు, మతాల వారిగా విభజించని రాజకీయ పార్టీలను ఎన్నుకోవాలని ఓటర్లకు ఆమె పిలుపునిచ్చారు.

ఆర్పీఎన్ సింగ్ పిరికిపంద‌

ఆర్పీఎన్ సింగ్ పిరికిపంద‌

కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన ఆపార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్‌పై ప్రియాంక గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు. పిరికిపందలు పోరాటం చేయలేరంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న యుద్దం పెద్ద సాహసంతో కూడుకొని ఉంటుంద‌న్నారు. ఈ పోరాటం చేయాలంటే ఎంతో ధైర్యం, శక్తి సామర్థ్యాలు కావాలన్నారు. పిరికిపందలు ఈ పోరాటాలు చేయలేర‌ని విమర్శించారు.

రైతుల పట్ల బీజేపీ విద్వేషపూరిత ధోరణి

రైతుల పట్ల బీజేపీ విద్వేషపూరిత ధోరణి

కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు, లఖింపూర్ ఖేరి ఘటనలు ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతాయని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ప్రధాని మోదీపాలనలో రైతులు అప్పులు పాలైయారని.. వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రైతుల పట్ల విద్వేషపూరిత ధోరణిలో అవలంభిస్తోందని ఆరోపించారు. యూపీలో యోగి ప్ర‌భుత్వం ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చ‌గొట్టి ప‌బ్బం గ‌డుపుకుంటుంద‌ని దుయ్యబట్టారు.

ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాతే పొత్తులు

ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాతే పొత్తులు


ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితులకు అనుగుణంగా ఇతర పార్టీలతో పొత్తులపై పార్టీ ఓ నిర్ణయం తీసుకుంటుందని ప్రియాంక గాంధీ చెప్పారు. యూపీలో కాంగ్రెస్ పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్నాయన్నారు. ప్రగతి శీల ఎజెండాతో కాంగ్రెస్ పనిచేస్తోందన్నారు. విద్య , ఉపాధి, ఉద్యోగ కల్పన, ఆరోగ్య , అభివృద్ధి సమస్యలపై ఎన్నికలు జరగాలన్నారు.

మ‌హిళ‌ల‌కు 40శాతం పార్టీ టికెట్లు

మ‌హిళ‌ల‌కు 40శాతం పార్టీ టికెట్లు


ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా సాధికారత ప్రధాన అజెండా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తోందని ప్రియాంక గాంధీ తెలిపారు. 40శాతం పార్టీ టికెట్లను మహిళలకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. మహిళలు రాజకీయ, ఎన్నికల శక్తిగా ఏకతాటిపైకి వస్తే దేశ రాజకీయాలను మార్చే సత్తా వారికి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో మాఫియా పాలనను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని దుయ్యబట్టారు.

English summary
Congress Leaders Priyanka Gandi comments on allance with parties in up
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X