డబుల్ కిక్.. ఒక బీర్ కొంటే మరొకటి ఫ్రీ.. రెండు రోజులే ఆఫర్..!
ఎండలు మండిపోతున్నాయి. మార్చి మొదటివారం నుంచే ఎండలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రజలు బయటకు వెళ్దామంటే మాడు పగులుతోంది. ఇక వేసవిని తట్టుకోలేక మందుబాబులు చల్లని బీర్లు తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. అలాంటివారికి డబుల్ కిక్ ఇచ్చే వార్త ఇది. ఇప్పుడు వైన్ షాపుల ముందు ఒక బీర్ కొంటే మరొక బీర్ ఫ్రీ అని బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో బార్ షాపుల ముందు మందుబాబులు క్యూ కడుతున్నారు.
తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి ఆ రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ లోని మద్యం దుకాణాలు స్టాక్ క్లియరెన్స్ సేల్స్ ప్రకటించాయి. బ్రాండీ, విస్కీలపై 50 శాతం నుంచి 70 శాతం వరకు భారీ డిస్కౌంట్లు అందిస్తున్నాయి. అంతేకాదు బీర్లకు 1+1 ఆఫర్లు ప్రకటించడంతో మద్యం ప్రియులు దుకాణాల వద్ద బారులు తీరారు. సాధారణ ధరలతో పోలిస్తే కొన్ని బ్రాండెడ్ మద్యం బాటిల్స్ 70శాతం తక్కువ ధరకే లభిస్తున్నాయి.

బీర్లకు 1+1 ఆఫర్ తో పాటు పలు రకాల మద్యం బ్రాండ్ లకు భారీ డిస్కౌంట్లు ప్రకటించడంతో రాష్ట్రంలో మద్యం విక్రయాలు విపరీతంగా పెరిగాయి. కొంతమంది వ్యాపారులు రూ.3,000 విలువైన మద్యం బాటిళ్లను కేవలం రూ.1,000కే విక్రయిస్తున్నారు. ఈ స్టాక్ క్లియరెన్స్ సేల్ కారణంగా సాధారణ రోజుల్లో కంటే దుకాణదారులకు 40 శాతం ఎక్కువ వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది.
మరోవైపు మద్యం ధరలు భారీగా తగ్గడంతో కొందరు వినియోగదారులు ఈ భారీ తగ్గింపుల కారణంగా కొందరు వినియోగదారులు ఎక్కువ మద్యం నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తక్కువ ధరల కారణంగా మద్యం అమ్మకాలు విపరీతంగా పెరగడంతో పాటు వినియోగదారుల ఆసక్తి దృష్ట్యా ఈ ఆఫర్లు మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications