మద్యం మత్తులో రైలులో నుండి ఐదుగురి తోసివేత, ముగ్గురి మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: మద్యం మత్తులో నడుస్తున్న రైలులో నుండి మహిళతో పాటు ఆమె నలుగురు పిల్లలను బయటకు తోసివేయడంతో ముగ్గురు మృతి చెందిన దారుణ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.

మద్యం మత్తు ఓ కుటుంబంలో పెను విషాదం రేపింది. ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు ప్రాణాలు బలి తీసుకుంది. మరో ఇద్దరు చిన్నారులను గాయాలపాలు చేసింది. బీహార్‌లోని మోతీహరికి చెందిన ఇద్దు, ఇక్బాల్ సోదరులు పనుల కోసం పంజాబ్‌కు బయలుదేరారు.

UP: Woman and her 4 daughters thrown out of train in Lakhimpur district, 3 dead

అమృతసర్, సహర్సా జన్ సేవా ఎక్స్‌ప్రెస్ రైల్లో ప్రయాణిస్తుండగా మద్యం మత్తులో గొడవ పడ్డారు. ఆ సమయంలో రైలు లంకేపూర్ జిల్లా మైఖల్ గంజ్ ప్రాంతంలో ఉంది. ఇద్దు భార్య అఫ్రీన్, నలుగురు కుమార్తెలు వారితోపాటే ప్రయాణిస్తున్నారు.

వీరి మద్య గొడవ పెరిగింది. దరిమిలా ఇక్బాల్ కోపంతో పక్కనే ఉన్న అఫ్రీన్‌ను రైల్లోంచి తోసేశాడు. తర్వాత నలుగురు చిన్నారులను విసిరేశాడు. ఈ ఘటనలో అఫ్రీన్‌తోపాటు ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు గాయపడినవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు పరారీలో ఉన్న ఇద్దు, ఇక్బాల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman and her four daughters were thrown off a train , one at a time, as it moved through Uttar Pradesh, killing two and leaving the other three seriously injured, police said today.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి