కేంద్ర మంత్రులపై నితీష్ కుమార్ అసంతృప్తి: రాజీలేదని వ్యాఖ్య
పాట్నా: ఇద్దరు కేంద్ర మంత్రుల తీరుపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆయన అన్నారు. ఈ విషయంలో తాను ఎప్పుడూ రాజీ పడలేదని స్పష్టం చేశారు.
లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెసు పార్టీలతో తెగదెంపులు చేసుకుని ఎన్డీఎ కూటమిలో చేరిన నితీష్ కుమార్ పరోక్షంగా బిజెపిని తప్పు పట్టారు. అవినీతిపైగానీ, సమాజాన్ని విభజించడానికి ప్రయత్నించే శక్తులతో గానీ తాను రాజీ పడలేదని చెప్పారు.

తాను మత, సామాజిక శాంతికి కట్టుబి ఉన్నట్లు తెలిపారు. ప్రేమ, దయాగుణం, మతసామరస్య భావనలతోనే దేశం ముందుకు సాగుతుందని ఆయన అన్నారు.
దళితులు, మైనారిటీల విషయంలో బిజెపి దృక్పథం మారాలనే కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ అభిప్రాయంతో ఆయన ఏకీభవించారు. తనకు రామ్ విలాస్ పాశ్వాన్ తనకు బాగా తెలుసునని, ఆలోచన లేకుండా పాశ్వాన్ ఈ విషయాలపై మాట్లాడబోరని నితీష్ అన్నారు.
నితీ్ష్ కుమార్ వ్యాఖ్యలపై వ్యాఖ్యానించడానికి బిజెపి నిరాకరించింది. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, అశ్విని చౌబే వ్యాఖ్యలపై అసెంబ్లీలో దుమారం చేలరేగిన నేపథ్యంలో నితీష్ కుమార్ అలా మాట్లాడారు
ఆర్జెడి విజయం సాధించడంపై గిరిరాజ్ సింగ్ ప్రతిస్పందిస్తూ - అరారియా ఉగ్రవాద నిలయంగా మారుతుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద యెత్తున దుమారం చెలరేగింది. కాగా, తన కుమారుడ్ అరిజిత్ శాశ్వత్ మితవాద కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీలో భాగల్పూర్‌లో రెచ్చగొట్టే నినాదాలు చేశారు. అది ఘర్షణలు దారి తీసింది. దీంతో మంత్రి అశ్విని చౌబే వివాదంలో చిక్ుకున్నారు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications