పాక్! యుద్ధం కోరుకుంటే సిద్ధమే: విజేందర్, మోడీ హెచ్చరిక
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని యూరీలోని ఆర్మీ బేస్ క్యాంప్ పై ఉగ్రవాదుల దాడిని ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ ఖండించాడు. దాడిపై ట్విట్టర్లో ఘాటుగ స్పందించాడు. పాకిస్తానీలు యుద్ధాన్ని కోరుకుంటే అందుకు సిద్ధమేనని పేర్కొన్నాడు.

ఉగ్రదాడిలో అమరవీరులైన 17మంది జవానుల కుటుంబాలకు తన సానుభూతిని వ్యక్తం చేశాడు. కాగా, రెండేళ్ల క్రితం ఈ ప్రాంతంలోని మొహ్రాపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 10మంది జవానులు అమరులయ్యారు. ఉగ్రదాడి నేపథ్యంలో హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అమెరికా, రష్యా పర్యటనలను రద్దు చేసుకున్నారు.
Very sad news 17 soldiers martyred my condolence to the family 🙏🏽 #UriAttack if Pakistanis have chosen war.Let go for it🇮🇳 #IndianArmy
— Vijender Singh (@boxervijender) September 18, 2016
ఉగ్రదాడికి శిక్ష తప్పదు: మోడీ హెచ్చరిక
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఆదివారం ఉదయం జరిగిన ఉగ్రదాడి ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడిని ఖండించిన ప్రధాని, దాడికి కారణమైన వారికి శిక్ష తప్పదని మోడీ హెచ్చరించారు.
ఉగ్రదాడిలో వీర మరణం పొందిన జవాన్లకు ఈ సందర్భంగా మోడీ సెల్యూట్ చేశారు. వారి సేవలను దేశం ఎప్పుడూ గుర్తుంచుకుంటుందని అన్నారు. ఘటనపై హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణమంత్రి మనోహర్ పారికర్ తో మాట్లాడినట్లు తెలిపారు. కాగా, పరిస్థితిని సమీక్షించేందుకు రక్షణ మంత్రి పారికర్ కాశ్మీర్ బయల్దేరారు.












Click it and Unblock the Notifications