రాజ్‌పథ్‌ను 'నో ఫ్లై జోన్‌'గా ప్రకటించండి: అమెరికా, కుదరదన్న కేంద్రం

న్యూఢిల్లీ: భారత్‌లో ప్రతి ఏడాది జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్ ఉత్సవాలకు తొలిసారి ఓ అమెరికా అధ్యక్షుడు రానున్న తరుణంలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్న విషయం తెలిసిందే. రిపబ్లిక్ వేడుకల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు వేదికపై ఉండే సమయంలో రాజ్‌పథ్ రహదారిని విమానరహిత ప్రాంతం (నో ఫ్లై జోన్)గా ప్రకటించాలని అమెరికా కోరింది.

దీనికి కేంద్రం ఎట్టి పరిస్ధితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేసింది. రాజ్‌పథ్‌ను విమాన రహిత ప్రాంతంగా ప్రకటిస్తే, పరేడ సమయంలో యుద్ధ విమాన విన్యాసాలను రద్దు చేయాల్సి ఉంటుంది. భారత వైమానిక ప్రదర్శన లేకుండా ఇంత వరకూ ఒక్క రిపబ్లిక్ పరేడ్ కూడా నిర్వహించలేదు.

US asks for a no-fly zone over Rajpath on R-Day, India says no

అమెరికా కోరిన ఈ కోరికను ఎట్టి పరిస్ధితుల్లోనూ అంగీకరించబోమని కేంద్ర ప్రభుత్వ అధికారి చెప్పినట్లు తెలుస్తోంది. రిపబ్లిక్ పరేడ్ వేడుకల్లో భాగంగా భారత వైమానికి దళం కేవలం 10 నిమిషాలు మాత్రమే తన ప్రదర్శనను ఇస్తుంది. సంవత్సరమంతా రాష్ట్రపతి భవనం, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్, ప్రధానమంత్రి నివాసం విమానరహిత ప్రాంతం (నో ఫ్లై జోన్)గానే ఉంటుందని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+