భారత్‌కు బుజ్జగింపులు: రష్యాకు వ్యతిరేకంగా మద్దతు: అమెరికా, బ్రిటన్, యూరప్ ప్రతినిధుల రాక

న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఇవ్వాళ్టికి 22వ రోజుకు చేరుకుంది. ఇప్పట్లో ఇది ఆగేలా కనిపించట్లేదు. యుద్ధాన్ని నిలిపివేయాలంటూ అంతర్జాతీయంగా వస్తోన్న ఒత్తిళ్లను రష్యా ఏ మాత్రం లెక్క చేయట్లేదు. తన దూకుడును ప్రదర్శిస్తూనే ఉంది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా రష్యాకు వ్యతిరేకంగా ఆదేశాలను జారీ చేసింది. యుద్ధాన్ని తక్షణమే ఆపేయాలంటూ తీర్పు ఇచ్చింది. దీన్నీ రష్యా- పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించట్లేదు.

పట్టు బిగించిన రష్యా..

పట్టు బిగించిన రష్యా..

ఇప్పటికే- సరిహద్దులకు ఆనుకుని ఉన్న కీలక పట్టాలపై రష్యా పట్టు బిగించింది. మరియోపోల్, ఖేర్సన్, ఖార్కీవ్, చెర్న్‌హీవ్, వొల్నోవాఖా, ఒడెస్సా.. వంటి పలు నగరాలను స్వాధీనం చేసుకుంది. తన ఆధీనంలోకి తెచ్చుకుంది. రాజధాని కీవ్ కోసం రష్యా సైనిక బలగాలు ఎడతెరిపి లేకుండా పోరాటాన్ని సాగిస్తోన్నాయి. ఆ నగరంపై విరుచుకుపడుతున్నాయి. సరిహద్దు నగరాలపై పట్టును కోల్పోయినప్పటికీ- కీవ్‌ను కాపాడుకునే విషయంలో ఉక్రెయిన్ సైన్యం తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. రష్యా బలగాలను ఎక్కడికక్కడ అడ్డుకుంటోంది.

 లెక్క చేయని పుతిన్..

లెక్క చేయని పుతిన్..

యుద్ధం ప్రారంభమైన 22 రోజుల తరువాత కూడా రెండు దేశాలు వెనక్కి తగ్గకపోవడం, అన్నిరకాలుగా ఆంక్షలు, నిషేధాజ్ఞలను విధించినప్పటికీ.. రష్యా వాటిని లెక్క చేయని పరిస్థితులు నెలకొన్నాయి. అంతర్జాతీయంగా అత్యున్నత వేదిక ఐక్యరాజ్య సమితి చేసిన సూచనలను కూడా రష్యా పట్టించుకోవట్లేదు. ఈ పరిణామాల మధ్య తాజాగా- అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు తమ వ్యూహాన్ని మార్చుకున్నాయి.

బుజ్జగింపులు షురూ..

బుజ్జగింపులు షురూ..

తటస్థంగా ఉంటోన్న దేశాలను బుజ్జగించడంపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా- ఆయా దేశాల ప్రతినిధులు త్వరలోనే భారత పర్యటనకు రానున్నారు. అమెరికా, యూరోయన్ యూనియన్‌ ప్రతినిధులతో పాటు బ్రిటన్ విదేశాంగ శాఖ కార్యదర్శి ఎలిజబెత్ ట్రస్స్- భారత్‌లో పర్యటించనున్నారు. ఈ నెలాఖరున వారి పర్యటన ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆయా శాఖల ఉన్నతాధికారులు, జాతీయ భధ్రత సలహాదారు అజిత్ దోవల్‌ను వారు కలుసుకుంటారని సమాచారం.

ప్రతినిధులు వీరే..

ప్రతినిధులు వీరే..


అమెరికా విదేశాంగ శాఖ రాజకీయ వ్యవహారాల విభాగం అండర్ సెక్రెటరీ విక్టోరియా న్యులాండ్, అసిస్టెంట్ సెక్రెటరీ డొనాల్డ్ లు ఈ ప్రతినిధుల బృందంలో ఉన్నారు. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో శక్తిమంతమైన దేశం కావడం వల్ల భారత్ మద్దతును కూడగట్టుకునే ప్రయత్నానికి దిగాయి ఆయా దేశాలన్నీ. రష్యాకు వ్యతిరేకంగా వ్యవహరించేలా ఆయా దేశాల ప్రతినిధులు భారత్‌ను బుజ్జగించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశంగా చెబుతున్నారు.

డిస్కౌంట్ క్రూడాయిల్ విషయంలో..

డిస్కౌంట్ క్రూడాయిల్ విషయంలో..

రష్యా ఇచ్చిన డిస్కౌంట్ క్రూడాయిల్ ఆఫర్‌ను భారత్ అంగీకరించడం పట్ల అమెరికా స్పందించిన విషయం తెలిసిందే. ఈ ఆఫర్‌ను అంగీకరించడాన్ని అమెరికా తప్పు పట్టనప్పటికీ నర్మగర్భంగా విమర్శలు గుప్పించింది భారత్‌పై. రష్యాపై తాము విధించిన ఆంక్షలను ఉల్లంఘించినట్టు కూడా పరిగణించలేమని స్పష్టం చేశారు. యుద్ధానికి దిగిన రష్యా వైపు మొగ్గు చూపడాన్ని మాత్రం తాము ఎంతమాత్రం సమర్థించట్లేదని పేర్కొన్నారు.

తటస్థంగా ఉన్న భారత్..

తటస్థంగా ఉన్న భారత్..

నిజానికి- రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ తటస్థ వైఖరిని అనుసరిస్తోన్న విషయం తెలిసిందే. ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ వేదికలపైనా తన నిర్ణయాన్ని స్పష్టం చేసింది. అటు రష్యా వైపు గానీ, ఇటు ఉక్రెయిన్‌ను గానీ భారత్ సమర్థించట్లేదు. అదే సమయంలో యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలనే వాదనను బలంగా వినిపిస్తోంది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తోంది. రష్యాతో భారత్ ఏమాత్రం ఘర్షణ వైఖరికి వెళ్లట్లేదు.

 రష్యాతో సన్నిహిత సంబంధాలు..

రష్యాతో సన్నిహిత సంబంధాలు..


దేశ రక్షణ వ్యవస్థకు అవసరమైన ఆయుధాలను రష్యా సరఫరా చేస్తోంది. 80 శాతం రక్షణ పరికరాలు ఆ దేశం నుంచే అందుతోన్నాయి. దశాబ్దాలుగా రష్యా.. భారత్‌కు నమ్మకమైన మిత్రదేశంగా ఉంటూ వస్తోంది. ఆయా కారణాలతో తటస్థ వైఖరిని అనుసరిస్తోంది. ఇదే విషయాన్ని పలుమార్లు స్పష్టం చేసింది భారత్. ఈ పరిస్థితుల్లో భారత వైఖరిని మార్చడానికి అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ దేశాల ప్రతినిధులు ఇక్కడికి రానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+