• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమెరికా స్నేహహస్తం: ఆరు విమానాల్లో భారత్‌కు చేరిన కోవిడ్ సంబంధిత సామగ్రి

|

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా రెండో దశ నేపథ్యంలో చేస్తానన్న సాయాన్ని అమెరికా ప్రారంభించింది. గతంలో భారత్‌ తమకు చేసినట్లుగానే ఈసారి వారికి సాయం అందిస్తామన్న అధ్యక్షుడు జో బైడెన్ మాటల్ని నిజం చేస్తున్నారు. గతవారం అతిపెద్ద సైనిక విమానం కరోనా సామాగ్రి, వ్యాక్సిన్లు, వైద్య పరికరాలు, ఇతర సాయాన్ని మోసుకుంటూ కాలిఫోర్నియా నుంచి భారత్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మహమ్మారిపై పోరాటంలో భారత్‌కు అండగా నిలవాలని భావించిన అమెరికా... గత వారం రోజుల్లో మొత్తం ఆరు భారీ విమానాల్లో కరోనాసామగ్రిని ఢిల్లీకి చేర్చింది. ఇక ఇప్పటి వరకు అమెరికా చేసిన మొత్తం సాయం విలువ దాదాపు 100 మిలియన్ అమెరికన్ డాలర్లు మేరా ఉంటుందని అంచనా. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్‌లోని ఆరోగ్య నిపుణులు, ఇతర ఉన్నతాధికారులతో చాలా దగ్గరగా సమీక్ష చేస్తోంది అమెరికా.

భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా అమెరికా ఆరు విమానాల్లో మందులు, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లతో పాటు ఇతర పరికరాలు సామగ్రిని పంపింది. ఇందులో 1,25,000 రెమ్‌డెసివిర్ వైయల్స్ ఉన్నాయి. అంతేకాదు భారత్‌లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉన్నందున 1500 ఆక్సిజన్ సిలిండర్లను అగ్రరాజ్యం పంపింది. ఈ సిలిండర్లు ఖాళీ అయితే స్థానిక సప్లయర్స్ దగ్గర తిరిగి రీఫిల్ చేసుకోవచ్చు. 550 మొబైల్ ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇక పంపిన ఈ కాన్సన్‌ట్రేటర్లు ఐదేళ్ల పాటు ఎలాంటి మరమత్తులు లేకుండా పనిచేస్తూ పేషెంట్లకు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి. ఒక మిలియన్ డయాగ్నస్టిక్ కిట్లు , 2.5 మిలియన్ ఎన్ 95 మాస్కులు కూడా ఉన్నాయి. ఇక ఒకేసారి 20 మంది పేషెంట్లకు ఆక్సిజన్ అందించేలా భారీ ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను సైతం పంపింది. 210 పల్స్ ఆక్సిమీటర్లను కూడా పంపింది.

US helps India to combat Covid 19 surge, delivers six planes with emergency medical supplies

భారత్‌కు మంచి మిత్రదేశమైన అమెరికా.. ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటున్న సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. భారత ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు వెంటనే స్పందించిన అమెరికా.. భారత్‌లోని రెడ్ క్రాస్ సంస్థకు ఈ సామగ్రిని చేరవేసింది. ఈ సంస్థ ద్వారా అత్యవసరమైన వారికి వెంటనే చేరేలా చర్యలు తీసుకుంటోంది. ఇక ఈ అత్యవసర సామగ్రిని భారత్‌కు చేరవేయడంలో అమెరికా డిఫెన్స్ శాఖ, ఆరోగ్య మరియు మానవసేవల శాఖ, ట్రావిస్ ఎయిర్ ఫోర్స్ బేస్, నేషనల్ ఎయిర్‌లైన్స్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ కీలక పాత్ర పోషించాయి. దీనికి తోడు 1000 మొబైల్ ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల కొనుగోలుకు నిధులు కూడా ఇచ్చింది అమెరికా ప్రభుత్వం.

70 ఏళ్ల సుదీర్ఘ స్నేహం భారత్ అమెరికా ఉండటంతో మిత్రదేశంకు కష్టం రాగానే అగ్రరాజ్యం వెంటనే స్పందించింది. కోవిడ్-19 ప్రారంభ దశ నుంచే అమెరికా భారత్‌కు సహాయం చేస్తోంది. అంతేకాదు భారత్‌లో ఎమర్జెన్సీ పద్ధతిన పలు ప్రైవేట్ సంస్థలతో కలిసి అమెరికా పనిచేస్తోంది. ప్రైవేట్ ఉత్పత్తిదారుల నుంచి పెట్టుబడిదారుల వరకు అందరితోనూ అమెరికా చర్చలు జరిపి వారితో జతకట్టి భారత్‌లో ఈ మహమ్మారిపై విజయం సాధించాలనే కృతనిశ్చయంతో పనిచేస్తోంది.

English summary
US had stepped into help India amid the surge in Covid cases. In connection with this US had sent Covid equipment in six planes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X