JD Vance: ఢిల్లీలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్-రాత్రికి మోడీతో డిన్నర్..!

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా ఇవాళ డిల్లీ చేరుకున్నారు. సతీమణి ఉషావాన్స్, ముగ్గురు పిల్లలతో పాటు ఢిల్లీలోని పాలం ఎయిర్ బేస్ లో దిగిన జేడీ వాన్స్ కు ఘనస్వాగతం లభించింది. అక్కడ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆయనకు స్వాగతం పలికారు. భారత్ అల్లుడైన జేడీ వాన్స్ తన నాలుగు రోజుల టూర్ లో భాగంగా దేశంలోని పలు పర్యాటక స్థలాల్ని సందర్శించనున్నారు. అలాగే ఇవాళ రాత్రికి ప్రధాని మోడీతో కలిసి డిన్నర్ చేస్తారు. భారత్-అమెరికా సంబంధాలపై చర్చలు కూడా జరపనున్నారు.

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇవాళ రాత్రికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై సమావేశం నిర్వహించనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంతో సహా దాదాపు 60 దేశాలపై భారీ సుంకాల విధానాన్ని విధించి, ఆపై తాత్కాలికంగా నిలిపివేసిన తర్వాత వాన్స్ భారత్ కు తొలిసారి అధికారిక పర్యటనపై వచ్చారు. దీంతో జేడీ వాన్స్ టూర్ లో ఇరుదేశాల మధ్య పలు అంశాలపై చర్చలు జరిగే అవకాశముంది.

US vice president JD Vance landed in Delhi with Family- here is tour agenda

ఢిల్లీలో దిగిన తర్వాత జేడీ వాన్స్ కుటుంబం స్వామినారాయణ్ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించనున్నారు. సాంప్రదాయ హస్తకళా వస్తువులను విక్రయించే షాపింగ్ కాంప్లెక్స్‌ను సందర్శించే అవకాశం ఉంది. సాయంత్రం 6:30 గంటలకు అధికారిక చర్చల కోసం వాన్స్ ప్రధాని అధికారిక నివాసమైన 7, లోక్ కళ్యాణ్ మార్గ్ లో మోడీని కలుస్తారు. అనంతరం జైపూర్‌కు బయలుదేరి వెళ్లనున్నారరు.

జైపూర్‌లో జేడీ వాన్స్ కుటుంబం అమెర్ కోటను సందర్శిస్తారు. జైపూర్ పర్యటన తర్వాత వాన్స్ తన కుటుంబంతో కలిసి ఆగ్రాను సందర్శించే అవకాశం ఉంది. అక్కడ వారు తాజ్ మహల్‌ను సందర్శిస్తారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయనకు స్వాగతం పలకనున్నారు. జేడీ వాన్స్ భారత పర్యటనలో రెండు దేశాలు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడంపై చర్చించనున్నాయి. ఈ భేటీలో సుంకాలు, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన అంశాలపైనా ఇరుదేశాలు చర్చించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+