మొబైల్ ఫోన్‌తో ఈవీఎం తెరిచిన ఎంపీ బామ్మర్ది: కేసు ఫైల్: ఎన్నికల ఫలితాల తారుమారుపై రచ్చ షురూ
EVMs: సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత.. దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల యథేచ్ఛగా ట్యాంపరింగ్ చేశారని, వాటిల్లో రికార్డయిన ఫలితాలను తారుమారు చేశారంటూ కుప్పలు తెప్పలుగా వార్తలు వస్తోన్నాయి.
దాదాపుగా 140కి పైగా లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా కంటే అధికంగా ఓట్లు పోల్ కావడాన్ని దీనికి నిదర్శనంగా చూపిస్తోన్నారు. సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్, కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్.. ఇప్పటికే ఈ అంశంపై గళం విప్పారు. ప్రశాంత్ భూషణ్ ఓ అడుగు ముందుకేసి న్యాయపోరాటానికీ సిద్ధపడుతున్నారు.

ప్రత్యేకించి- ఏపీలో వెలువడిన ఫలితాలు రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోన్నాయి. ఎందుకంటే- రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకుంటామనే ధీమాతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస పార్టీ.. ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కావడం దీనికి ప్రధాన కారణం. అనేక నియోజకవర్గాల్లో వేల కొద్దీ ఓట్ల తేడాతో ఓడిపోయారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు.
పోలింగ్ ముగిసిన తరువాత చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు సైతం ఓటింగ్ ప్రక్రియపై అనుమానాలను రేకెత్తేలా చేసిందనే వాదనలూ లేకపోలేదు. ఇటీవలే ది వైర్ ప్రచురించిన కథనం సైతం ఈ అనుమానాలను బలపడేలా చేసింది. వీటన్నింటిపైనా దర్యాప్తు జరిపించేలా న్యాయపోరాటం చేస్తానని వెల్లడించారు ప్రశాంత్ భూషణ్.
ఈ పరిణామాల మధ్య- ఈవీఎంల పని తీరుపై అనుమానాలను మరింత బలాన్ని కలిగించే సంఘటన తాజాగా చోటు చేసుకుంది. శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం) లోక్‌సభ సభ్యుడు రవీంద్ర వైకర్ బావమరిది మంగేష్ పండిల్కర్.. స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన ఈవీఎంలను తన మొబైల్ ఫోన్ ద్వారా తెరిచినట్లు తేలింది. ఈ ఘటనలో ఆయనపై కేసు నమోదైంది.

మొన్నటి ఎన్నికల్లో ముంబై నార్త్ వెస్ట్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు రవీంద్ర వైకర్. కేవలం 48 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి, శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) అభ్యర్థి అమోల్ గజానన్ కీర్తికర్‌ను ఓడించారు. వైకర్‌కు 4,52,644, గజానన్ కీర్తికర్‌కు 4,52,596 ఓట్లు పోల్ అయ్యాయి.
ఓట్ల లెక్కింపు కంటే ముందే గోరేగావ్ కౌంటింగ్ కేంద్రంలో మంగేష్ తన మొబైల్ ఫోన్‌లో అమర్చిన ఓ ప్రత్యేక డివైజ్‌తో ఈవీఎంను తెరిచారు. ఈ విషయాన్ని ఇదే లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి గుర్తించారు. దీన్ని రిటర్నింగ్ అధికారి దినేష్ గౌరవ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 188 సెక్షన్ కింద కేసు పెట్టారు.
దీనికి సంబంధించిన ఓ దినపత్రిక క్లిప్‌ను ప్రశాంత్ భూషణ్.. తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఇండియా కూటమి గెలవాల్సిన ఈ నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థి విజేతగా నిలిచాడంటూ ఎద్దేవా చేశారు.
-
దానం నాగేందర్‌కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
Tamil Nadu Survey: తాజా సర్వేలో బీజేపీకి భారీ షాక్- గెలిచేది మాత్రం వీరే..? -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications