నిద్రపోతుండగా అపహరించి అమ్మాయిపై గ్యాంగ్ రేప్
బదయూ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదయూలో మరో ఘోరం జరిగింది. పదమూడేళ్ల వయస్సు గల బాలికను నలుగురు వ్యక్తులు అపహరించి, ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన బదయూ జిల్లాలోని జరీఫ్‌నగర్ ప్రాంతంలో జరిగింది.
ఈ ఘటనలో పోలీసులు ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని పోలీసులు శనివారంనాడు వెల్లడించారు. గత రాత్రి బాధితురాలు ఇంట్లో మేడపై నిద్రపోతుండగా దుండగులు వచ్చి ఆమెను అపహరించుకుని వెళ్లిపోయారు.

అమ్మాయిపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడినట్లు సీనియర్ ఎస్పీ సంతోష్ కుమార్ చెప్పారు. అణిత్, ముక్తియార్, భోలా పండిట్, దన్ను అనే వ్యక్తులను ఈ ఘటనలో నిందితులుగా గుర్తించారు. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అమిత్, ముక్తియార్‌లను అరెస్టు చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని సంతోష్ కుమార్ చెప్పారు.












Click it and Unblock the Notifications