Exit polls: ఉత్తర ప్రదేశ్‌పై రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్ ఏం చెబుతోంది
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాలకు నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడటం ఆరంభమైంది. చివరి విడత ఉత్తర ప్రదేశ్ పోలింగ్ ముగిసిన అరగంట తరువాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడవుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన మీడియా హౌస్‌లు, ఎన్నికల సర్వేల ఫలితాలను వెల్లడిస్తున్నాయి. అందరి కళ్లూ ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌పై నిలిచాయి. దీనితో పాటు ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ప్రకటితమౌతున్నాయి.
ఉత్తర ప్రదేశ్‌లో అధికార భారతీయ జనతా పార్టీ, దాని మిత్రపక్షాలు కలిసి మరోసారి అధికారాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోందని రిపబ్లిక్ టీవీ పీ-మార్క్ ఎగ్జిట్‌పోల్ రిజల్ట్స్ స్పష్టం చేసింది. ప్రతిపక్ష సమాజ్‌వాది పార్టీ, మిత్రపక్షాలు మరోసారి ప్రతిపక్ష స్థానానికే పరిమితమౌతుందని అంచనా వేసింది. 2017 నాటి ఎన్నికల్లో వచ్చిన స్థానాలతో పోల్చుకుంటే- ఈ సారి ఆ సంఖ్య భారీగా తగ్గుతుందని, అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాది పార్టీకి సీట్లు పెరుగుతాయని అంచనా వేసింది.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండోసారి ప్రభుత్వ పగ్గాలను అందుకుంటారని అభిప్రాయపడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్‌ను బీజేపీ అందుకుంటుందని రిపబ్లిక్ టీవీ పీ-మార్క్ ఎగ్జిట్‌పోల్ పేర్కొంది. 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 202 స్థానాలు అవసరం అవుతాయి. ఈ మేజిక్ ఫిగర్‌ను బీజేపీ అందుకుంటుందని అంచనా వేసింది.
బీజేపీ-తన మిత్రపక్షాలతో కలిసి 240కిపైగా సీట్లలో విజయఢంకా మోగిస్తుందని రిపబ్లిక్ టీవీ పీమార్క్ అంచనా వేసింది. సమాజ్‌వాది పార్టీ-140, మాజీ ముఖ్యమంత్రి మాయావతి నాయకత్వాన్ని వహిస్తోన్న బహుజన్ సమాజ్‌వాది పార్టీకి 17 స్థానాలు దక్కుతాయని తెలిపింది. కాంగ్రెస్ పార్టీ కనీసం రెండంకెలను కూడా అందుకోలేకపోవచ్చని అభిప్రాయపడింది. హస్తం పార్టీ నాలుగు స్థానాలకు మాత్రమే పరిమితమౌతుందని పేర్కొంది.
ఇతరులు రెండు నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమౌతాయని రిపబ్లిక్ టీవీ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ స్పష్టం చేసింది. దీన్ని బట్టి చూస్తే- యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం కానుంది. సమాజ్‌వాది పార్టీ తన ఓటు శాతాన్ని, అసెంబ్లీ స్థానాల సంఖ్యను భారీగా పెంచుకున్నప్పటికీ.. ప్రధాన ప్రతిపక్ష స్థానానికే పరిమితమౌతుందని ఈ సర్వే ద్వారా స్పష్టమౌతోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర, ప్రభుత్వ వ్యవహారాల్లో అవినీతి వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుంది.
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications