అయ్యో.. అయ్య నిన్న ప్రమాణం చేశారో లేదో.. ఇవాళ కొడుకు కారు ప్రమాదం.. ఎవరంటే..?

ఉత్తరప్రదేశ్‌లో నిన్ననే ప్రభుత్వం కొలువుదీరింది. యోగి ఆదిత్యనాథ్ రెండోసారి సీఎంగా పదవీ ప్రమాణం చేశారు. ఆయన మంత్రివర్గంలో డిప్యూటీగా రెండోసారి కేశవ్ పర్సాద్ మౌర్యకు అవకాశం దక్కింది. ఆయన ప్రమాణం చేసిన తెల్లవారే.. ఆయన కుమారుడు కారు ప్రమాదానికి గురయ్యింది. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని.. కారు డ్యామేజ్ అయ్యిందని పోలీసులు తెలుపడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు.

జలౌన్ జిల్లాలో గల అలంపూర్ బైపాస్ శనివారం మధ్యాహ్నం యోగేశ్ కుమార్ మౌర్య ఫార్చ్యునర్ కారు ప్రమాదానికి గురయ్యింది. అతని కారును ట్రాక్టర్ ఢీ కొంది. దీంతో కారు వెనకభాగం డ్యామేజ్ అయ్యింది. ఘటనాస్థలానికి కల్పి పోలీసులు చేరుకున్నారు. ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం లేదని.. కారు డ్యామేజ్ అయ్యిందని ఎస్పీ రవికుమార్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో యోగేశ్ కారులోనే ఉన్నారని ఎస్పీ చెప్పారు. అతనికి ఎలాంటి గాయలు కాలేదని చెప్పారు. యోగేశ్ తండ్రి నిన్న డిప్యూటీ సీఎంగా రెండోసారి పదవీ ప్రమాణం చేయగా.. ఇవాళ కారు ప్రమాదానికి గురయ్యింది.

Uttar Pradesh Deputy CMs son escapes unharmed in car accident

985లో రాజ్‌కుమారి దేవిని మౌర్యను కేశవ్ ప్రసాద్ మౌర్య వివాహం చేసుకున్నారు. వీరికి ఆశిష్ కుమార్ మౌర్య, యోగేశ్ కుమార్ మౌర్య అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. యాక్సిడెంట్ చేసిన యోగేశ్ చిన్న కుమారుడు. సిరతు నగర్ హై స్కూల్‌లో కేశవ్ ప్రసాద్ పాఠశాల విద్య కొనసాగింది.సెకండరీ ఎడ్యుకేషన్ ఓసా స్కూల్‌లో సాగింది. తన తండ్రికి చేదోడు వాదోడుగా నిలిచేందుకు మౌర్య చిన్న తనంలో న్యూస్ పేపర్స్ అమ్మేవారు. తర్వాత ప్రయోగ్ రాజ్‌లో హిందీ లిటరేచర్ చేశారు. హిందీలో సాహిత్య సమ్మేళనంలో పూర్తి చేశారు.

1980లో ఆర్ఎస్ఎస్‌తో మౌర్యకు అనుబంధం ఏర్పడింది. భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్‌తో కూడా మంచి రిలేషన్ షిప్ ఉండేది. గో సంరక్షణ, రామజన్మభూమి ఉద్యమాల్లో మౌర్య కీ రోల్ పోషించారు. 1990లో అయోధ్యలో మందిర నిర్మాణం కోసం కర్ సేవక్ బృందానికి నేతృత్వం వహించారు. 2012లో సిరతు నుంచి మౌర్య ఎమ్మెల్యే పదవీకి పోటీ చేశారు. 2014లో పుల్పూర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2002, 2007, 2012లో అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. 2016లో యూపీ బీజేపీ అధ్యక్ష పదవీ బాధ్యతలను చేపట్టారు. ఆ మరుసటి ఏడాది డిప్యూటీ సీఎం అయ్యారు. ఇప్పుడు మరోసారి పదవీని చేపట్టారు. ఇవాళ కుమారుడి కారు ప్రమాదానికి గురయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+