Yogi Adityanath : యోగీ మనసున్న మారాజు-రైతుల థ్యాంక్స్.. కారణమిదే..
ఉత్తర్ ప్రదేశ్ లో వరుసగా రెండోసారి గెలిచి అధికారంలో ఉన్న యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తాజాగా నోయిడా అంతర్జాతీయ ఎయిర్ పోర్టు అభివృద్ధికి వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో రాష్ట్రంలోని జెవార్ ప్రాంతంలో ఉన్న భూమి అవసరం ఏర్పడింది. అయితే ఇక్కడే ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది.
జెవార్ ప్రాంతంలో ఉన్న ఈ భూమి ప్రభుత్వానికి చెందిందే. అయితే 45 ఏళ్లుగా స్ధానిక రైతుల చేతుల్లోనే ఉంది. ఇప్పుడు జెవార్ లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం కోసం ప్రభుత్వం భూములు సేకరిస్తోంది. ఇందులో భాగంగా ఈ భూమిని సైతం ప్రభుత్వానికి అప్పగించాలని అధికారులు రైతుల్ని ఆదేశించారు.

దీంతో రైతులు తమకు పరిహారం ఇవ్వకపోతే భూమి ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. కానీ అధికారులు మాత్రం ప్రభుత్వ భూమికి ప్రభుత్వం తిరిగి పరిహారం ఎలా ఇస్తారని ప్రశ్నించి నిరాకరించారు. దీంతో ఈ రైతులు నిరసనలు చేపట్టారు. విమానాశ్రయం సరిహద్దు గోడ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. విమానాశ్రయం నిర్మాణానికి ఆటంకం కలిగించారు.
ఈ దశలో సీఎం యోగీ ఆదిత్యనాథ్ జోక్యం చేసుకుని రైతులకు పరిహారం ఇచ్చేయాలని నిర్ణయించారు. గత 45 ఏళ్లుగా తాము ఉపయోగిస్తున్న ప్రభుత్వ భూమికి పరిహారం, పునరావాస ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకునేందుకు యోగి ఆదిత్యనాథ్ అనుమతించడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. Moto GP భారత్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు గ్రేటర్ నోయిడాకు వచ్చిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో పాటు వారు సమావేశం అయ్యారు. తమ జీవితాలను మార్చిన నిర్ణయానికి కృతజ్ఞతలు తెలియజేయాలనుకున్న 21 మంది రైతుల ప్రతినిధి బృందంతో యోగీ సమావేశమయ్యారు.
తమ ప్రభుత్వం రైతులు , పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని యోగీ తెలిపారు అందుకే వారికి అనుకూలంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని గౌతమ్‌బుద్ధ యూనివర్సిటీ గెస్ట్‌హౌస్‌లో రైతులతో జరిగిన సమావేశంలో సీఎం యోగి అన్నారు. ఈ సమావేశంలో రన్‌హేరా, వీరంపూర్, ముద్రా, తదితర ప్రాంతాల రైతులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications