రూ.3 లకే బ్రేక్ ఫాస్ట్, రూ.5 లకే భోజనం:యోగి ఆధిత్యనాథ్ బంపర్ ఆఫర్
తమిళనాడు రాష్ట్రంలో విజయవంతమైన అమ్మ క్యాంటీన్ తరహా పథకాన్ని ప్రవేశపెట్టాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.తక్కువ ధరకే బ్రేక్ ఫాస్ట్, భోజనాన్ని అందించనున్నారు.
లక్నో:తమిళనాడు రాష్ట్రంలో విజయవంతమైన అమ్మ క్యాంటీన్ తరహా పథకాన్ని ప్రవేశపెట్టాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.తక్కువ ధరకే బ్రేక్ ఫాస్ట్, భోజనాన్ని అందించనున్నారు.
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జయలలిత ఉన్న కాలంలో అమ్మ క్యాంటీన్లను ప్రవేశపెట్టింది. అతి తక్కువ ధరకే బ్రేక్ ఫాస్ట్, భోజనాన్ని అందిస్తున్నారు.
ఈ తరహ సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా జయలలిత మరోసారి అధికారంలోకి వచ్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరో వైపు ఇదే తరహ సంక్షేమ పథకాలను ఇతరరాష్ట్రాల్లో కూడ అమలు చేయాలని ఆయా ప్రభుత్వాలు ప్లాన్ చేస్తున్నాయి.ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడ ఇదే తరహ పధకాన్ని అమలు చేసేందుకు ఆ రాష్ట్రం ముందుకు వచ్చింది.

రూ.3 కే బ్రేక్ ఫాస్ట్, రూ.5 కే భోజనం
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో యోగి ఆధిత్యనాధ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ రాష్ట్రంలో అనేక కొత్త పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇదే స్పీడులో మరో కొత్త పథకాన్ని అమలు చేయాలని యోగి ఆదిత్యనాథ్ భావిస్తున్నారు. అతి తక్కువ ధరకే భోజనం, బ్రేక్ ఫాస్ట్ ను అందించాలని ఆయన తలపెట్టారు.రూ.3. లకే బ్రేక్ ఫాస్ట్, రూ.లకే భోజనం అందించాలని యోగి నిర్ణయం తీసుకొన్నారు.

సబ్సిడీ క్యాంటీన్లను ప్రారంభించనున్న సర్కార్
తమిళనాడు తరహలోనే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడ సబ్సిడీ క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. ఈ మేరకు కాన్పూర్, లక్నో, ఘజియాబాద్, గోరఖ్ పూర్ లలో సబ్సిడీ క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

పథకానికి తుదిమెరుగులు దిద్దే బాధ్యతలు మంత్రులు
ఈ పథకానికి తుదిమెరుగులు దిద్దే బాధ్యతను మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, సురేష్ ఖన్నాలకు అప్పగించారు. ఇతర రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలను మంత్రుల బృందం పరిశీలిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కంటే మెరుగ్గా యూపిలో ఈ పథకాన్ని ఏ రకంగా అమలు చేయాలనే దానిపై మంత్రులు పరిశీలిస్తున్నారు.

అధికారులతో యోగి ఏప్రిల్ 12న సమావేశం
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అతి తక్కువ ధరకే భోజనం , బ్రేక్ ఫాస్ట్ అందించే పథకం విషయమై చర్చించేందుకుగాను ఈ నెల 12వ, తేదిన కార్మికశాఖాధికారులతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ సమావేశం కానున్నారు.అన్నపూర్ణ భోజనాలయాల పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

200 క్యాంటీన్ల ఏర్పాటుకు సర్కార్ యోచన
తమిళనాడు తరహలోనే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడ సుమారు 200 సబ్సీడి క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని యూపి ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్యాంటీన్లు 24 గంటలపాటు పనిచేయనున్నాయి,అన్నపూర్ణ భోజనాలయాలతో పాటు ప్రతి జిల్లా కేంద్రంలో కూడ గోశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications