68 వేల మంది ఉద్యోగులకు జీతాలు వేయని ప్రభుత్వం
ప్రభుత్వ ఉద్యోగం అంటే భద్రత, నెలాఖరున జీతం ఖాయం అన్న భావనకు ప్రభుత్వం ఒక్కసారిగా బ్రేక్ వేసింది. మనం ఏం చేసినా చెల్లుతుంది... ఏ టైంకు ఆఫీస్ కు వెళ్లినా అడిగేవాళ్లు లేరు, కావాల్సినంత సంపాదించుకోవచ్చనే ధోరణిలో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగులందరికి "ఆస్తుల వివరాలు చెప్పకపోతే జీతం లేదు" అనే కఠిన నిర్ణయం అమలులోకి వచ్చింది. ఈ ఒక్క ఆదేశంతో 68,000 మందికి పైగా ఉద్యోగుల జనవరి నెల జీతాలను నిలిపివేసింది. ప్రభుత్వ సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచాలన్న లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లో వివిధ శాఖల్లో కలిపి ఎనిమిది లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ఉద్యోగులందరూ 2025 డిసెంబర్ 31 వరకు సంపాదించిన తమ ఆస్తుల పూర్తి వివరాలను 'మానవ సంపద' పోర్టల్‌లో 2026 జనవరి 31లోగా తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాల్సి ఉంది. ఈ గడువును పట్టించుకోని వారిపై చర్యలు తప్పవని ప్రభుత్వం ముందుగానే హెచ్చరించింది.

ఈ విషయంపై ముఖ్య కార్యదర్శి గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. "జనవరి 1 నుంచే ఆస్తి వివరాలు అప్‌లోడ్ చేసే సదుపాయం అందుబాటులో ఉంది. కాబట్టి నిబంధనలు పాటించకపోవడానికి ఎలాంటి కారణాలు ఉండవు" అని ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ, వేలాది మంది ఉద్యోగులు చివరి తేదీ వరకు ఆస్తుల వివరాలు సమర్పించకపోవడం అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది.
Uttar Pradesh ప్రభుత్వం పదేపదే రిమైండర్‌లు..
ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ, "ఈ నిబంధనలపై ముందుగానే సమాచారం ఇచ్చాం. పదేపదే రిమైండర్‌లు పంపాం. అయినా 68,000 మందికి పైగా ఉద్యోగులు గడువులోగా ఆస్తి వివరాలు అప్‌లోడ్ చేయలేదు. అందుకే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వారి జనవరి జీతాలను నిలిపివేశాం" అని తెలిపారు.
ప్రమోషన్లు కూడా ఇవ్వం..
అంతేకాదు, శాఖల అధిపతులకూ ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసింది. తమ కింద పనిచేసే ఉద్యోగులు నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని సూచించింది. గడువు దాటితే అది ప్రతికూల అంశంగా పరిగణించబడుతుందని హెచ్చరించింది. మరింత కఠినంగా, 2025 ఫిబ్రవరి 1 తర్వాత జరిగే పదోన్నతులను కూడా పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది.
అయితే, జీతాలు నిలిపివేయబడిన ఉద్యోగులకు ఇంకా ఒక అవకాశం ఉంది. ఇప్పటికీ తమ ఆస్తి వివరాలను 'మానవ సంపద' పోర్టల్‌లో అప్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. తదుపరి చర్యలు మాత్రం ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నిర్ణయించబడతాయని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగుల్లో కలకలం రేపుతుండగా, పారదర్శక పాలన దిశగా యూపీ ప్రభుత్వం తీసుకున్న కఠిన అడుగుగా రాజకీయ, పరిపాలనా వర్గాలు దీన్ని విశ్లేషిస్తున్నాయి.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications