టెర్రాస్ మీద టార్చర్ పెట్టి ఇద్దరు పిల్లలను నరికేశాడు, ఎన్ కౌంటర్ లో లేపేసిన పోలీసులు !
ఉత్తరప్రదేశ్‌లో దారుణ హత్యలు జరిగాయి. బార్బర్ గా పని చేసే సాజిద్ అనే నిందితుడు ఆయుష్ (13), అహాన్ (7), పియూష్ (6) అనే పిల్లలపై గొడ్డలితో దాడి చేశాడు. వీరిలో ఇద్దరు పిల్లలు మృతి చెందగా, మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడి నుంచి పారిపోయిన నిందితుడు బార్బర్ సాజిద్ (22)ను పోలీసులు వెంబడించి ఎన్‌కౌంటర్ లో అంతం చేశారు.
ఉత్తరప్రదేశ్ పోలీసులు కూడా ఈ దారుణ హత్యల గురించి నిందితులకు అక్కడికక్కడే స్పష్టమైన సందేశం పంపడానికి ఈ ఎన్ కౌంటర్ చేశారని తెలిసింది. ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లోని బాబా కాలనీలో సాజిద్ అనే నిందితుడు బార్బర్ షాప్ నడుపుతున్నాడు. సెలూన్ పక్కనే వినోద్ కుమార్ సింగ్ అలియాస్ వినోద్ అనే వ్యక్తి ఇల్లు ఉంది. వినోద్ అతని భార్య, అతని ముగ్గురు పిల్లలు ఆయుష్, అహాన్, పియూష్ తో కలిసి నివాసం ఉంటున్నారు.

మార్చి 19వ తేదీ మంగళవారం రాత్రి సుమారు 7.30 గంటలకు సాజిద్ అతని బార్బర్ షాపు పక్కనే నివాసం ఉంటున్న వినోద్ ఇంటికి వెళ్లాడు. ఈ సమయంలో వినోద్ ముగ్గురు పిల్లలు వాళ్ల ఇంటి డాబాపై ఆడుకుంటున్నారు. సాజిద్ నేరుగా టెర్రస్‌పైకి వెళ్లి చిన్నారులపై గొడ్డలితో దాడి చేశాడు. ఒక్కసారిగా సాజిద్ గొడ్డలితో దాడి చెయ్యడంతో భయపడిపోయిన పిల్లలు వద్దు అంకుల్ అంటు అతన్ని వేడుకున్నారని తెలిసింది. ఆయితే శాడిస్టు సాజిద్ మాత్రం గొడ్డలితో ముగ్గురు పిల్లల మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు.
సాజిద్ దాడిలో 6 ఏళ్ల బాలుడు పియూష్, 13 ఏళ్ల బాలుడు ఆయుష్ మృతి చెందారు. 7 ఏళ్ల బాలుడు ఆహాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేసిన సాజిద్ పిల్లలు నివాసం ఉంటున్న ఇంటి నుంచి వస్తుండగా గాయపడిన బాలుడు అహాన్ ఏడుపు స్థానికులు వినిపించింది. దీంతో స్థానికులు సాజిద్ ను చుట్టుముట్టేందుకు ప్రయత్నించారు. అయితే నిందితుడు సాజిద్ అతని చేతిలో గొడ్డలితో స్థానికులను బెదిరించి అక్కడి నుంచి పరారయ్యాడు.
వినోద్ కుమార్ ఇంట్లో లేని సమయంలో సాజిద్ అతని ఇంట్లోకి వెళ్లి అతని ముగ్గురు పిల్లల మీద దాడి చేశాడని స్థానికులు అంటున్నారు. ముగ్గురు చిన్నారులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వీరిలో గాయపడిన 7 ఏళ్ల బాలుడు అహాన్ చికిత్స పొందుతున్నాడని, మిగిలిన ఇద్దరు పిల్లలు చనిపోయారని బాదౌన్ ఎస్ ఎస్ పీ అలోక్ ప్రియదర్శి తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జంట హత్యలు చేసిన సాజిద్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసులకు స్థానికులు కొంత సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు నిందితుడు సాజిద్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులను చూసిన శాడిస్టు సాజిద్ పోలీసుల మీద దాడి చెయ్యడానికి ప్రయత్నించి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు సాజిద్ ను వెంబడించి చివరికి అతన్ని ఎన్‌కౌంటర్ లో లేపేశారు. వినోద్ పిల్లలను చంపడానికి అసలు కారణాలు తెలియరాలేదని పోలీసులు అంటున్నారు.
ఉత్తరప్రదేశ్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. నిందితుడు సాజిద్ ముగ్గురు పిల్లలను దారుణంగా నరికేసిన తరువాత మేడ మీద నుంచి కిందకు వస్తూ తన పని ముగించేశానని అరుస్తు అక్కడి నుంచి పారిపోయాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ జంట హత్యల వెనుక మత విద్వేషం ఉందనే అనుమానం కనిపిస్తోందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
హిందూ పిల్లలను ఇద్దరిని సాజిద్ దారుణంగా హత్య చెయ్యడంతో ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చిన్నారులను కిరాతకంగా చంపిన నిందితుడు సాజిద్‌ను ఎన్‌కౌంటర్ చేయడం ద్వారా పోలీసులు ఇలాంటి నిందితులకు స్పష్టమైన సందేశాన్ని పంపారు. హత్య ఎవరు చేసినా అక్కడికక్కడే లేపేస్తామని ఉత్తరప్రదేశ్ పోలీసులు నిందితులకు ఎన్ కౌంటర్ ద్వారా వార్నింగ్ ఇచ్చారు. సాజిద్ తో పాటు అతని సోదరుడు జావెద్ కూడా ఈ జంట హత్యల్లో పాల్లొన్నాడని బాధితులు, స్థానికులు ఆరోపిస్తున్నారని, ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి అలోక్ ప్రియదర్శి అన్నారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications