ముఖ్యమంత్రి కన్యా సుమంగళ యోజన పథకం ఏంటి..?
ముఖ్యమంత్రి కన్యా సుమంగళ యోజన( Kanya Sumangala yojana scheme) ద్వారా ఉత్తరప్రదేశ్ మహిళలు ఎంతో లబ్ధి పొందారని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.సామాన్య మహిళలకు విద్య, భద్రతను ఈ పథకం కల్పిస్తోంది.
ఉత్తర్ ప్రదేశ్‌లో వరుసగా 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎవరూ లేరు.అయితే ఈ రికార్డును యోగీ ఆదిత్యనాథ్(Yogi Adityanath) బద్దలు కొట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక ఇదే ఊపును లోక్‌సభ ఎన్నికలకు కూడా కొనాసాగించాలనే లక్ష్యంతో యోగీ ఆదిత్యనాథ్ కొత్త పథకాలను ప్రకటిస్తున్నారు.

ముఖ్యమంత్రి కన్యా సుమంగళ యోజన : ముఖ్యమంత్రి కన్యా సుమంగళ యోజన 2019లో ప్రారంభించారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన మహిళలకు ఆర్థిక భద్రత ఇవ్వడంతోపాటు విద్యావకాశాలను ఈ పథకం అందిస్తుంది. తద్వారా వారికి ఉజ్వల భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించారు.ఈ పథకం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రమంతటా అమలవుతుండగా.. ప్రయాగ్‌రాజ్ జిల్లాకు చెందిన మహిళలు అత్యధికంగా లబ్ధి పొందుతున్నారు.
అత్యధిక లబ్ధిదారులు : 2022-23 ఆర్థిక సంవత్సరంలోనే, ప్రయాగ్‌రాజ్‌లో మొత్తం 59,635 మంది బాలికలు పథకం ద్వారా ప్రయోజనం పొందారు. దీంతో ప్రయాగ్‌రాజ్ ఈ పథకం ద్వారా అత్యధికులు లబ్ధిపొందతున్న జిల్లాగా నిలిచింది. ఇక ప్రయాగ్‌రాజ్ జిల్లా తర్వాత ఉన్నావ్ రెండో స్థానంలో నిలువగా, వారణాసి, హర్దోయ్,ఫతేపూర్ జిల్లాలు వరుసగా మూడు నాలుగు ఐదవ స్థానాల్లో నిలిచాయి.
భద్రత, ఆరోగ్యం, విద్యతో సహా ప్రాథమిక హక్కులను కల్పించేందుకు మహిళా శిశుహత్య, అసమాన లింగ నిష్పత్తి, బాల్య వివాహాలు, కుటుంబాల్లోని మహిళల పట్ల ప్రతికూల వైఖరి వంటి సామాజిక సమస్యల నుంచి మహిళలను రక్షించేందుకు ప్రభుత్వం ముఖ్యమంత్రి కన్యా సుమంగళ యోజనను అమలు చేసిందని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications