దేశంలోనే తొలిసారిగా... ఉత్తరప్రదేశ్ రికార్డ్
అలీఘర్, ఆజంగఢ్, మొరాదాబాద్, శ్రావస్తి, చిత్రకూట్, సోన్‌భద్ర నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయని మంత్రి సురేష్ ఖన్నా తెలిపారు
ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలతో సహా రాష్ట్రంలో త్వరలో 20కి పైగా ఆపరేటలైజ్డ్ విమానాశ్రయాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి సురేష్ ఖన్నా, తన ప్రసంగంలో.. "యోగి ప్రభుత్వ హయాంలో, పౌర విమానయాన రంగంలో గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి చోటు చేసుకుంటోందని, ప్రస్తుతం తొమ్మిది విమానాశ్రయాలు పనిచేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలున్నాయని, జెవార్, అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయాలు నిర్మాణంలో ఉన్నాయని, వీటితో కలిపి మొత్తం ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలున్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ ఆవిర్భవించబోతుందన్నారు.
యోగి ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు నాలుగు విమానాశ్రయాల నిర్మాణ పనులు పూర్తయ్యాయని, అలీఘర్, ఆజంగఢ్, మొరాదాబాద్, శ్రావస్తి, చిత్రకూట్, సోన్‌భద్ర నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయని మంత్రి తెలిపారు. "రాబోయే సంవత్సరాల్లో, రాష్ట్రంలో ఐదు అంతర్జాతీయ మరియు 16 దేశీయ విమానాశ్రయాలు, ఈ విధంగా మొత్తం 21 విమానాశ్రయాలు కలిగిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ రికార్డ్ సృష్టించబోతోందని, ప్రజలకు అతి తక్కువలో విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నామని సురేష్ ఖన్నా తెలిపారు.

2023-24 ఆర్థిక సంవత్సరానికి యోగి ప్రభుత్వం వార్షిక బడ్జెట్.. రాష్ట్రంలో మెరుగైన రైలు, రోప్‌వే కనెక్టివిటీకి ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. వారణాసిలో ప్రజా రవాణా కోసం భారతదేశపు మొట్టమొదటి రోప్‌వే ప్రాజెక్ట్‌కు కూడా ప్రాధాన్యత ఇచ్చామన్నారు. అలాగే UPలోని నాలుగు మెట్రోపాలిటన్ నగరాల్లో మెట్రో రైలు సేవల అభివృద్ధికి రూ.2500 కోట్ల కంటే ఎక్కువ కేటాయింపులున్నట్లు వెల్లడించారు. ఆగ్రా మెట్రో రైలు ప్రాజెక్టులో రూ.465 కోట్లు పెట్టుబడి పెట్టనున్నామని, మరోవైపు, వారణాసి, గోరఖ్‌పూర్, ఇతర నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టు కోసం రూ.100 కోట్లతో ప్రాథమిక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications