కుప్పకూలిన మూడంతస్తుల భవనం: ఐదుగురు మృతి, 24 మందికి తీవ్రగాయాలు

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం లక్నోలో ఓ మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో 24 మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతులను పంకజ్ తివారీ (40), ధీరజ్ గుప్తా (48), అరుణ్ సోంకర్ (28)గా పోలీసులు గుర్తించారు. పలువురు భవన శిథిలాల కింద చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు.

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. ఘటనాస్థలికి చేరుకున్న డీసీపీ శశాంక్ సింగ్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. వర్షం కారణంగా బిల్డింగ్ కుప్పకూలినట్లు ప్రాథమికంగా అధికారులు తెలిపారు.

Uttar Pradesh Three-storied building collapses in Lucknow five dead

లక్నోలో ట్రాన్స్‌పోర్ట్ నగర్‌లోని హర్మిలాప్ భవనాన్ని గోడౌన్‌గా ఉపయోగిస్తున్నారు. శనివారం ఈ భవనం ఒక్కసారిగా కుప్పకూలడం వల్ల అందులో పని చేస్తున్న కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఇప్పటి వరకూ ఐదుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. భవనం గ్రౌండ్​ ఫ్లోర్​లో మోటార్ వర్క్‌షాప్, మొదటి అంతస్తులో మెడికల్ షారప్, రెండవ అంతస్తులో గోడౌన్ ఉంది. మూడంతస్తుల్లో కొన్ని నిర్మాణ పనులు జరుగుతున్నాయని, దీన్ని నాలుగేళ్ల క్రితం నిర్మించారని అధికారులు వివరాలు వెల్లడించారు.

ఈ ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరాతీశారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి, సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, ఈ ప్రమాద ఘటనపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. జిల్లా మేజిస్ట్రేట్‌తో మాట్లాడారు. సహాయక చర్యలు, గాయపడిన వారికి అందిస్తున్న చికిత్స గురించి సమాచారం తెలుసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+