"నిరసనల్లో పాల్గొంటే ఉద్యోగాలివ్వం..!"-యోగీ సర్కార్ సంచలన ఉత్తర్వులు..!

గతంలో నీట్ అక్రమాలపై, తాజాగా ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ సందర్భంగా చేసిన అక్రమాలపై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఇందులో యువత లక్షల సంఖ్యలో పాలుపంచుకుంటోంది. ఇదే క్రమంలో బంగ్లాదేశ్, నేపాల్ తరహాలో ప్రభుత్వాల మార్పును యువత డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరనసల్లో అక్కడక్కడా హింస కూడా చోటు చేసుకుంటోంది. ఇప్పుడు ఈ కారణాల్ని చూపుతూ వారికి ప్రభుత్వ ఉద్యోగాలు నిరాకరించాలని ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) లోని యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ ఇచ్చిన ఉత్తర్వులు కలకలం రేపుతున్నాయి.

సీజేపీ వెనుక బీజేపీ ? మోడీ టార్గెట్ గా అన్నామలై తీవ్ర విమర్శలు..!
సీజేపీ వెనుక బీజేపీ ? మోడీ టార్గెట్ గా అన్నామలై తీవ్ర విమర్శలు..!

ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే ఉద్యోగులకు కఠిన నిబంధనలు విధించాలని యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది ఈ మేరకు వెంటనే ఉత్తర్వులు కూడా జారీ చేసేసింది. వీటి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులు తమ నడవడిక ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. 'ప్రభుత్వ మార్పు' తీసుకురావాలనే లక్ష్యంతో హింసలో పాల్గొన్న వారిని ప్రభుత్వ ఉద్యోగాలకు దూరం చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ తరహాలో భారతదేశంలోనూ ప్రభుత్వ మార్పు కోసం కుట్ర జరుగుతోందంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్ తాజాగా హెచ్చరించిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు ఇచ్చారు.

Uttar Pradesh Tightens Character Verification Rules for Government Job Aspirants
మోడీ కంచుకోట బద్దలు-వారణాసిలో సమాజ్ వాదీ పార్టీ బిగ్ షాక్..!
మోడీ కంచుకోట బద్దలు-వారణాసిలో సమాజ్ వాదీ పార్టీ బిగ్ షాక్..!

ఈ కఠినమైన నిబంధనలు ప్రభుత్వ విభాగాలు, కార్పొరేషన్లు, కౌన్సిళ్లు, స్థానిక సంస్థలలో జరిగే ప్రత్యక్ష నియామకాలకు వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఈ విధానం ప్రకారం, పాలన మార్పును లక్ష్యంగా చేసుకుని హింసాత్మక కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు తేలిన అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా పరిగణిస్తారు. అయితే కేవలం రాజకీయ భావజాలం మాత్రమే అనర్హతకు ప్రాతిపదిక కాదని ఉత్తర్వుల్లో తెలిపారు. అభ్యర్థి యొక్క రాజకీయ నమ్మకాలకు, హింసాత్మక చర్యల్లో వారి భాగస్వామ్యానికి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంటుందని పేర్కొన్నారు. ఒక అభ్యర్థిపై కేవలం ఎఫ్‌ఐఆర్ నమోదైనంత మాత్రాన లేదా వారిపై విచారణ పెండింగ్‌లో ఉన్నంత మాత్రాన, వారు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు కారని ఈ నిబంధనల్లో క్లారిటీ ఇచ్చారు. పోలీసు అధికారులు 30 రోజుల్లోపు వ్యక్తిత్వ ధృవీకరణ నివేదికలను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే అవసరమైన సందర్భాల్లో అభ్యర్థి గతంలో పనిచేసిన విభాగం నుండి కూడా సమాచారాన్ని సేకరించేందుకు ఈ విధానంలో అవకాశం కల్పించారు. ఈ సవరించిన నిబంధనలు ప్రత్యక్ష నియామకాల ద్వారా ప్రభుత్వ సేవలోకి ప్రవేశించే అభ్యర్థులకు వర్తిస్తాయి. ఇప్పటికే ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ కొత్త ఆదేశాల ప్రకారం వ్యక్తిత్వ ధృవీకరణ అవసరం ఉండదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+