Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Uttarakhand exit polls: జన్ కీ బాత్-ఇండియా న్యూస్, టూడేస్ చాణక్య అంచనాలు

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తవడంతో పలు వార్తా ఛానళ్లు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చివరిదైన ఏడో దశ అసెంబ్లీ ఎన్నికలు సోమవారం సాయంత్రం ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి.

టూడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్:

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బీజేపీ తిరుగులేని విజయం సాధిస్తుందని టూడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్ వెల్లడించింది.

బీజేపీ కూటమికి 43 సీట్లు
కాంగ్రెస్ కూటమికి 24 సీట్లు
ఇతరులకు 3 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.

జన్ కీ బాత్ ఇండియా న్యూస్ ఎగ్జిట్ పోల్:

జన్ కీ బాత్ ఇండియా న్యూస్ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీ, కాంగ్రెస్ మధ్య కొంత పోటీ ఉన్నట్లు అంచనా వేసింది. అయితే, బీజేపీకే అధికారం నిలుపుకునేందుకు అవకాశాలున్నాయని తెలిపింది.

బీజేపీకి 32-41 సీట్లు
కాంగ్రెస్ పార్టీకి 35-27
ఆమ్ ఆద్మీ పార్టీకి 0-1 స్థానం
ఇతరులకు 0-3 స్థానాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.

ఇక, ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి టైమ్స్ నౌ వీటో ఎగ్జిట్ పోల్స్ గమనించినట్లయితే..
మరోసారి బీజేపీనే అధికారాన్ని చేపడుతుందని తేల్చాయి.

బీజేపీకి 37 సీట్లు

కాంగ్రెస్ పార్టీకి 31 స్థానాలు

ఆమ్ ఆద్మీ పార్టీకి 01 సీటు

ఇతరులకు 01 స్థానం

Uttarakhand exit polls: Jan Ki Baat-India News and Todays Chanakya predicts bjp will win

రిపబ్లిక్-పీ మార్క్యూ ఎగ్జిట్ పోల్స్:

ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించిన రిపబ్లిక్-పీ మార్క్యూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను గమనించినట్లయితే..
బీజేపీకి 35-39 స్థానాలు
కాంగ్రెస్ పార్టీకి 28-34 స్థానాలు
ఆమ్ ఆద్మీ పార్టీకి 0-3 సీట్లు
ఇతరులు: 0-3 సీట్లు దక్కించుకునే అవకాశాలున్నాయని తెలిపింది.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మొత్తం 70 అసెంబ్లీ స్థాలున్నాయి.

ఏబీపీ సీ ఓటర్ ఉత్తరాఖండ్ ఎగ్జిట్ పోల్స్:

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఏబీపీ సీ ఓటర్ అంచనా వేసింది. ఈ అంచనాల ప్రకారం..

బీజేపీకి 26-32 సీట్లు

కాంగ్రెస్ పార్టీకి 32-38 స్థానాలు

ఆమ్ ఆద్మీ పార్టీకి 0-02 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

ఇండియాటూడే ఉత్తరాఖండ్ ఎగ్జిట్ పోల్స్:

ఇండియా టూడే మాత్రం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి బీజేపీనే వస్తుందని వెల్లడించింది. ఇండియా టూడే అంచనాల ప్రకారం..

బీజేపీకి 36-46 స్థానాలు
బీఎస్పీకి 20-30 సీట్లు
బీఎస్పీకి 2-4 స్థానాలు
ఇతరులకు 2-5 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

కాగా, మార్చి 10న అసలైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+