Yogi Adityanath: వారికి ప్యాంట్లు తడుస్తున్నాయి: యోగి ఆదిత్యనాథ్
ఉత్తరప్రదేశ్‌లో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఆస్కారం లేదని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. గతంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన సంఘవిద్రోహశక్తులకు ఈరోజు కోర్టు శిక్ష విధించినప్పుడు వారి ప్యాంటు తడిపిందన్నారు. గోరఖ్‌పూర్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీలోని సెక్టార్ 27లోని ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ. 1,071 కోట్లతో నిర్మించనున్న బహుళజాతి కంపెనీ పెప్సీకో ఫ్రాంఛైజీ అయిన ఎం/ఎస్ వరుణ్ బెవరేజెస్‌కు 'భూమి పూజన్' నిర్వహించి, శంకుస్థాపన చేసిన అనంతరం సభను ఉద్దేశించి యోగి ప్రసంగించారు.
రాష్ట్రంలో పెట్టుబడిదారుల భద్రత, వారి మూలధనం హామీ ఇస్తున్నామని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. యూపీలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. బలమైన శాంతిభద్రతలతో, ప్రజల జీవితానికి శత్రువులుగా ఉన్న మాఫియా ఇప్పుడు ప్రాణభయంతో ఉందని చెప్పారు. పెట్టుబడిదారులకు భద్రతపై పూర్తి హామీ ఇస్తున్నామని యోగి తెలిపారు. ప్రభుత్వం అందరి భద్రతకు బాధ్యత వహిస్తుందని, ప్రజల జీవితాల్లో శ్రేయస్సు, సంతోషాన్ని తీసుకురావడానికి కట్టుబడి ఉందని యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.

ఒకప్పుడు పోకిరీలు, మాఫియాలు వ్యాపారులను బెదిరించేవారని, వారిని కిడ్నాప్ చేసేవారని, కానీ నేడు అలా లేదన్నారు. ఆరేళ్ల క్రితం రాష్ట్రం అరాచకాలు, అల్లర్లతో అశాంతిగా ఉండేదని ఇప్పుడు ఉత్తరప్రదేశ్ శాంతియుతంగా ఉందని చెప్పారు. 33 లక్షల మందికి పైగా ప్రభురామ్ జన్మస్థలమైన అయోధ్యను సందర్శించారని వివరించారు. రాష్ట్రంలో వెయ్యికి పైగా 'శోభా యాత్రలు' చేపట్టగా, హిందూ-ముస్లిం జనాలు వాటిపై పూల వర్షం కురిపించారని గుర్తించారు. హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్రంలో 500కు పైగా 'శోభా యాత్రలు' ప్రశాంతంగా జరిగాయన్నారు.












Click it and Unblock the Notifications