భారత రెజ్లర్లకు వరల్డ్ రెజ్లింగ్ మద్దతు: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై వేటుకు హెచ్చరిక
న్యూఢిల్లీ: భారత్‌లో కొనసాగుతున్న రెజ్లర్ల నిరసనపై అంతర్జాతీయ క్రీడల గవర్నింగ్ బాడీ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(UWW) తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది. గ్లోబల్ రెజ్లింగ్ బాడీ.. నిరసన తెలిపిన భారతీయ రెజ్లర్ల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును, అరెస్టును ఖండించింది. ఇప్పటివరకు భారత అధికారులు నిర్వహించిన పరిశోధనల ఫలితాలు లేకపోవడంపై కూడా యూడబ్ల్యూడబ్ల్యూ అసంతృప్తి వ్యక్తం చేసింది.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వచ్చిన ఆరోపణలపై సమగ్రమైన, నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని యూడబ్ల్యూడబ్ల్యూ భారత అధికారులను కోరింది. కాగా, ఎలక్టివ్ జనరల్ అసెంబ్లీని సకాలంలో నిర్వహించడంలో విఫలమైతే డబ్ల్యుఎఫ్‌ఐని నిషేధిస్తామని హెచ్చరించింది.
'ఈ చివరి రోజులలో జరిగిన సంఘటనలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. నిరసన ప్రదర్శనను ప్రారంభించినందుకు రెజ్లర్లను పోలీసులు అరెస్టు చేసి తాత్కాలికంగా అదుపులోకి తీసుకున్నారు. వారు ఒక నెలకు పైగా నిరసనలు చేస్తున్న స్థలాన్ని కూడా అధికారులు క్లియర్ చేశారు. యుడబ్ల్యుడబ్ల్యు.. మల్లయోధులను నిర్బంధించడాన్ని గట్టిగా ఖండిస్తుంది. ఇప్పటివరకు జరిగిన పరిశోధనల ఫలితాలు లేకపోవడం పట్ల నిరాశను వ్యక్తం చేస్తోంది' అని యూడబ్ల్యూడబ్ల్యూ ఒక ప్రకటనలో తెలిపింది.

అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య IOA, WFI అడ్-హాక్ కమిటీ నుంచి తదుపరి ఎలక్టివ్ జనరల్ అసెంబ్లీ గురించి మరింత సమాచారాన్ని అభ్యర్థిస్తుందని పేర్కొంది. ఎన్నికల అసెంబ్లీని నిర్వహించడానికి మొదటగా నిర్ణయించిన 45 రోజుల గడువును గౌరవించాలని లేదా WFI సస్పెన్షన్‌కు గురికావచ్చని, తద్వారా అథ్లెట్లు తటస్థ జెండా కింద పోటీ చేయవలసి ఉంటుందని తేల్చి చెప్పింది.
సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా వంటి ఒలింపిక్ స్థాయి రెజ్లర్లు గత నెల రోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్నారు. ఇటీవల మహిళా 'మహాపంచాయత్' నిర్వహించడానికి కొత్త పార్లమెంట్ భవనం వద్దకు వెళుతుండగా ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.డబ్ల్యుఎఫ్‌ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వేధింపులు, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రెజ్లర్లు.
మరోవైపు బీజేపీ ఎంపీపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో తమ పతకాలను గంగా నదిలో నిమజ్జనం చేస్తామని ప్రకటించిన రెజ్లర్లు.. మంగళవారం హరిద్వార్ వెళ్లారు. కాగా, భారతీయ కిసాన్ యూనియన్ (టికైత్) నాయకుడు రాకేష్ టికాయత్ జోక్యం తర్వాత ప్రణాళిక మార్పులకు దారితీసింది. ఫెడరేషన్ చీఫ్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్రానికి 5 రోజుల గడువు ఇచ్చారు. కాగా, రెజ్లర్ల నిరసనపై బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ స్పందిస్తూ.. ఢిల్లీ పోలీసులు విచారణ జరుపుతున్నందున తాను ఏమీ స్పందించనని అన్నారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.. తాను తప్పు చేశానని తేలితే ఏ శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications