బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Vaccination: వ్యాక్సిన్ కేంద్రాన్ని హైజాక్ చేసిన ఎమ్మెల్యే, ప్రతిపక్షాలు ఫైర్, రీజిన్ ఇదే, క్లారిటీ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యే హైజాక్ చేసి ఆయన కల్యాణమండపంలోకి మార్చేశారని ఆరోపణలు రావడం దూమరం లేపింది. తన పార్టీ కార్యకర్తలకు మాత్రమే వ్యాక్సిన్ వెయ్యాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని ప్రతిపక్షాలు ఆరోపణలు చెయ్యడం వివాదాస్పదం అయ్యింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత టీకా కేంద్రంలో ఎమ్మెల్యే బ్యానర్లు, ఫ్లెక్సీలు ఎలా కడతారు అంటూ ప్రజలు మండిపడటంతో అధికార పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు బిత్తరపోయారు, వ్యాక్సిన్ కేంద్రాన్ని ఎందుకు మార్చారో అంటూ అధికార పార్టీ నాయకులు, అధికారులు క్లారిటీ ఇచ్చారు.

Wife argument: ఇంట్లో భార్యను గొడ్డలితో నరికి రోడ్డు మీద లాక్కొని వెళ్లిన భర్త, ఏం జరిగిందంటే !Wife argument: ఇంట్లో భార్యను గొడ్డలితో నరికి రోడ్డు మీద లాక్కొని వెళ్లిన భర్త, ఏం జరిగిందంటే !

ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రం

ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రం

బెంగళూరులోని సీవీ రామన్ నగర్ లోని భువనేశ్వరి నగర్ లో కర్ణాటక ప్రభుత్వం, బీబీఎంపీ అధికారులు ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ ( వ్యాక్సిన్ డ్రైవ్ ) కేంద్రాన్ని ఏర్పాటు చేసి స్థానిక ప్రజలకు టీకాలు వేస్తున్నారు. స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజలకు టీకాలు వేయించుకోవడానికి బీబీఎంపీ ఆరోగ్య శాఖ అధికారులు ముందుగానే 300 కు పైగా టోకన్లు పంపిణి చేశారు.

ఎమ్మెల్యే దెబ్బకు షాక్

ఎమ్మెల్యే దెబ్బకు షాక్

భువనేశ్వరి నగర్ లో బీబీఎంపీ అధికారులు ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రానికి ప్రజలు వెళ్లారు. సీవీ రామన్ నగర్ ఎమ్మెల్యే రఘు ఆదేశాల మేరకు కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమాన్ని సీవీ రామన్ నగర్ లోని ఓం శక్తి కల్యాణమండపంలోకి మార్చేశారని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు.

 మా పార్టీ వాళ్లకే వ్యాక్సిన్ వెయ్యాలి ?

మా పార్టీ వాళ్లకే వ్యాక్సిన్ వెయ్యాలి ?


ఓం శక్తి కల్యాణమండపం ఎమ్మెల్యే రఘు సొంత కల్యాణ మండపం అని అందుకే అక్కడికి వ్యాక్సిన్ డైవ్ కార్యక్రమాన్ని మార్చారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత వ్యాక్సిన్ డైవ్ కేంద్రంలో బీజేపీ కార్యకర్తలకు మాత్రమే వ్యాక్సిన్ వెయ్యాలని ఎమ్మెల్యే రఘు అధికారులకు ఆదేశాలు జారీ చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు.

 ఎమ్మెల్యే బ్యానర్లు, ఫ్లెక్సీలు

ఎమ్మెల్యే బ్యానర్లు, ఫ్లెక్సీలు


ఓం శక్తి కల్యాణమండపంలో మొత్తం ఎమ్మెల్యే రఘు బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, అది ప్రభుత్వ ఉచిత వ్యాక్సిన్ డైవ్ కార్యక్రమమో లేదా, బీజేపీ పార్టీ కార్యక్రమమో అర్థం కావడం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఓం శక్తి కల్యాణమండపంలోకి వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమాన్ని మార్చిన విషయంలో బీబీఎంపీ అధికారులు, వైద్యులు, వైద్య సిబ్బంది ప్రజలకు సమాధానం చెప్పలేక సతమతం అయ్యారు.

Recommended Video

Etela Rajender Resigns కేసీఆర్, హరీశ్, కవిత పై సంచలన వ్యాఖ్యలు | TRS
రద్దీ ఎక్కువగా ఉందని మార్చేశాము

రద్దీ ఎక్కువగా ఉందని మార్చేశాము


అయితే భువనేశ్వరి నగర్ లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ డైవ్ కేంద్రానికి ఎక్కువ మంది ప్రజలు వచ్చారని, రద్దీ ఎక్కువ కావడం వలనే ఓం శక్తి కల్యాణ మండపంలోకి మార్చామని బీబీఎంపీ అధికారులు అంటున్నారు. అధికార పార్టీ నాయకుల అండతో అధికారుల సైతం ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రఘు సొంత బావ, బెంగళూరులోని మహదేవపుర ఎమ్మెల్యే అరవింద్ లింబావలి ప్రస్తుతం కర్ణాటకలో మంత్రిగా ఉన్నారు.

English summary
Vaccination: The vaccination site at the Bhuvaneshwari Nagar PHC was shifted to a new location, reportedly at the behest of the BJP’s CV Raman Nagar MLA S Raghu, drawing sharp criticism from all quarters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X