వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొవిడ్ వ్యాక్సిన్ కావాలా?: CoWIN పోర్టల్ రిజిస్ట్రేషన్ ఉంటేనే 18 నుంచి 45 ఏళ్ల వ‌య‌సు వాళ్ల‌కు టీకా డోసు

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా మహమ్మారి విలయం కొనసాగుతుండగా, హెల్త్ కేర్ వసతుల్ని మెరుగుపర్చుకుంటూనే ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియనూ వేగవంతం చేశాయి. మే 1 నుంచి ప్రారంభం కానున్న మూడో దశ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా 18 నుంచి 45 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న వాళ్లుకు టీకాలు అందజేయనున్నారు. అయితే ఆ నిర్దేశిత వయసువారంతా టీకాల కోసం CoWIN వెబ్‌పోర్ట‌ల్‌లో త‌ప్ప‌నిసరిగా రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల్సిందేనని, నేరుగా వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవడం కుదరదని కేంద్ర ఆరోగ్య శాఖ అధికార వ‌ర్గాలు స్ప‌ష్టం చేశాయి.

జగన్.. ఒళ్లు జాగ్రత్త, జస్టిస్ రమణ వచ్చారు -బెయిల్ రద్దు భయంతో రాయబారాలు ఎంపీ రఘురామ తాజా బాంబుజగన్.. ఒళ్లు జాగ్రత్త, జస్టిస్ రమణ వచ్చారు -బెయిల్ రద్దు భయంతో రాయబారాలు ఎంపీ రఘురామ తాజా బాంబు

18 నుంచి 45 ఏళ్ల వయసు వాళ్లు వ్యాక్సిన్ పొందగోరితే తప్పనిసరిగా కొవిన్ పోర్టల్ లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని, అదే 45 ఏళ్ల పైన ఉన్న వాళ్లు మాత్రం తమకు దగ్గర్లోని వ్యాక్సినేష‌న్ కేంద్రంలోనే రిజిస్ట్రేష‌న్ చేసుకొని అప్ప‌టిక‌ప్పుడు వ్యాక్సిన్ తీసుకోవ‌చ్చ‌ని అధికారులు తెలిపారు.

 Vaccine registration on CoWIN must for those between 18 and 45 years to get vaccine shot

మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన అంద‌రికీ టీకాలు ఇవ్వనుండటంతో ఒక్క‌సారిగా వ్యాక్సిన్‌కు డిమాండ్‌కు పెరిగే అవ‌కాశం ఉంటుందని, అలా ఒకేసారి అంద‌రూ వ్యాక్సిన్ కేంద్రాల‌కు ఎగబడకుండా, రద్దీ ఏర్పడకుండా ఉండేందుకే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పెట్టామని, వ్యాక్సిన్ కావాలనుకునేవాళ్లు CoWIN పోర్ట‌ల్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి చేశామని అధికారులు వివరించారు. ఇందుకోసం

రేవంత్ రెడ్డికి మోదీ సర్కార్ షాక్ -ఎంపీ సహా ఇంకొందరి ట్వీట్లు బ్లాక్ -కరోనాపై ప్రభుత్వ వైఫల్యాన్ని నిలదీస్తే..రేవంత్ రెడ్డికి మోదీ సర్కార్ షాక్ -ఎంపీ సహా ఇంకొందరి ట్వీట్లు బ్లాక్ -కరోనాపై ప్రభుత్వ వైఫల్యాన్ని నిలదీస్తే..

వచ్చే నెల మొదటి వారం నుంచే మొదలుకానున్న మాస్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబందించి ఈ నెల 28 నుంచి ఆరోగ్య సేతు యాప్‌, CoWINల‌లో వ్యాక్సిన్ రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో టీకాల పంపిణీని సమర్థంగా అమలు చేయడం కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలను కూడా జారీ చేసింది.

ప్రైవేటు ఆసుపత్రులు, ఇండస్ట్రీలకు చెందిన ఆస్పత్రుల సహకారంతో అదనపు ప్రైవేట్ కొవిడ్ వ్యాక్సిన్‌ కేంద్రాలను రిజిస్టర్‌ చేయాలని, ఏయే ఆసుపత్రులు ఎన్ని వ్యాక్సిన్లను కొనుగోలు చేశాయో, టీకా నిల్వలు, వ్యాక్సిన్‌ ధరలను కొవిన్‌ యాప్‌లో ఎప్పటికప్పుడు పరిశీలించాలని, కొవిన్‌లో వ్యాక్సిన్‌ స్లాట్‌లను అందుబాటులో ఉంచుతూ అర్హులై వారందరికీ టీకాలు వేయాలని, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలు నేరుగా వ్యాక్సిన్ల కొనుగోలు నిర్ణయానికి ప్రాధాన్యమివ్వాలని, 18-45 ఏళ్ల వయసు గ్రూప్‌ వారికి కేవలం 'ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ మాత్రమే' అన్న విషయాన్ని ప్రచారం చేయాలని, టీకా కేంద్రాల వద్ద రద్దీ ఉండకుండా చూసే అధికారులకు పూర్తి సహకారం అందించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

English summary
Getting registered on the CoWIN web portal and taking an appointment to get a Covid-19 vaccine jab would be mandatory for those aged between 18 and 45 years as walk-ins will not be allowed initially, official sources said on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X