వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Vaccine shortage: దేశంలో రష్యన్ టీకా: అనుమతికి సై: నిపుణుల కమిటీ ఎమర్జెన్సీ భేటీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోన్న వేళ.. నాలుగు రోజుల పాటు టీకా ఉత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సందర్భంలో..దేశంలో కొనసాగుతోన్న వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సడన్ బ్రేక్ పడింది. ఏపీ సహా పలు రాష్ట్రాలు వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటోన్నాయి. ఏపీలో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి తాత్కాలికంగా పుల్‌స్టాప్ పడిందనే వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, రాజస్థాన్ వంటి చోట్ల చాలినంత వ్యాక్సిన్ అందుబాటులో ఉండట్లేదు. పలు రాష్ట్రాల్లో ఇప్పుడున్న వ్యాక్సిన్ స్టాక్.. మరో నాలుగైదు రోజులకు మించి రాకపోకవచ్చు.

సుప్రీంకోర్టులో కరోనా కలకలం: సగం మంది ఉద్యోగులు ఇన్ఫెక్టెడ్: కేసుల విచారణ మాటేంటీ?సుప్రీంకోర్టులో కరోనా కలకలం: సగం మంది ఉద్యోగులు ఇన్ఫెక్టెడ్: కేసుల విచారణ మాటేంటీ?

ఈ పరిస్థితుల మధ్య రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకుని రావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. భారత్‌లో అత్యవసర పరిస్థితుల్లో తమ వ్యాక్సిన్‌ను వినియోగించుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ ఇదివరకే స్పుత్నిక్ వీ వ్యాక్సీన్ తయారీ సంస్థ యాజమాన్యం దరఖాస్తును దాఖలు చేసింది. ప్రస్తుతం ఇవి సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ (ఎస్ఈసీ) వద్ద పెండింగ్‌లో ఉంటున్నాయి. ఆ దరఖాస్తులను పరిశీలించి, అనుమతి ఇవ్వడానికి ఎస్ఈసీ ఇంకాసేపట్లో అత్యవసరంగా సమావేశం కానుంది.

Vaccine shortage: SEC to meet today to take Sputnik V application for Emergency

ప్రస్తుతం దేశంలో రెండు రకాల వ్యాక్సిన్లను వినియోగిస్తోన్నారు. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తోన్న ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కోవిషీల్డ్ మాత్రమే వ్యాక్సినేషన్ కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ రెండూ కూడా ప్రస్తుతం దేశీయంగా ఏర్పడిన డిమాండ్‌ను తీర్చేలా కనిపించట్లేదు. కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ ఉత్పత్తిని రెట్టింపు చేస్తామని భారత్ బయోటెక్ వెల్లడించింది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ది కూడా అదే మాట.. అదే బాట. ఇప్పటికిప్పుడు కొరతను అధిగమించేలా వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తీసుకుని రావడం.. వాటిని సంబంధిత రాష్ట్రాలకు చేర్చడానికి కొంత సమయం పడుతుంది.

ఈలోగా రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకుని రావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వడానికి ఉద్దేశించిన దరఖాస్తులను పరిశీలించడానికి సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ కాస్సేపట్లో సమావేశం కానుంది. దేశ రాజధాని వేదికగా ఈ సమావేశం ఆరంభమౌతుంది. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ప్రభావం, క్లినికల్ ట్రయల్స్‌లో పనితీరును సంతృప్తికరంగా ఉంటే.. వెంటనే దాన్ని అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతించే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.

English summary
Subject Expert Committee to meet today to take up Sputnik V application for Emergency Use Authorisation in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X