వ్యాక్సినే శ్రీరామరక్ష: కరోనా సోకిన ఆస్పత్రిలో చేరే ఛాన్స్ తక్కువ.. ఇదీ లెక్క
కరోనా వైరస్ నివారణ టీకాతోనే సాధ్యం. యావత్ ప్రపంచంలో గల అందరూ టీకా తీసుకుంటే.. రక్కసిని పారదోలవచ్చు. అయితే టీకా పరిమితి ఎన్నిరోజులు అనే అంశంపై మాత్రం క్లారిటీ లేదు. ఒక్కొక్కరు ఒక్కొలా చెబుతున్నారు. కానీ 6 నెలల వరకు మాత్రం ఢోకా లేదు. అందుకోసమే వ్యాక్సిన్ తీసుకునేందుకు జనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. టీకాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కొత్త విషయం తెలియజేసింది. ఈ మేరకు నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్ కేంద్ర వైద్యారోగ్య శాఖకు కీలక విషయాలు వెల్లడించారు.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వైరస్ సోకినా ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. 75-80 శాతం వరకు ఆస్పత్రిలో చేరే అవకాశం తగ్గుతుందపి అధ్యయనంలో తేలిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆక్సిజన్ అవసరాన్ని సైతం ఎనిమిది శాతానికి తగ్గించినట్లు స్పష్టం చేసింది. శంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లు పేర్కొంది.

మే 7న నమోదైన అత్యధిక కేసులతో పోలిస్తే ప్రస్తుతం రోజువారీ కేసుల్లో 85 శాతం తగ్గుదల నమోదవుతున్నట్లు వెల్లడించింది. మే 10తో పోలిస్తే రోజువారీ క్రియాశీలక కేసులు 78.6 శాతం తగ్గినట్లు పేర్కొంది. ఏప్రిల్ 30-మే 6 మధ్య ఒక వారంలో పాజిటివిటీ రేటు 21.6 శాతంగా నమోదైందని.. అప్పటితో పోలిస్తే పాజిటివిటీ రేటు ప్రస్తుతం వారానికి 81 శాతం తగ్గిందని వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 513 జిల్లాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువగా ఉందని తెలిపింది.
వ్యాక్సిన్ తీసుకుంటే 94 శాతం రక్షణ ఉంటుందని తెలిపింది. కరోనాను జయించాలంటే టీకా కంపల్సరీగా తీసుకోవాలని స్పష్టంచేసింది. రకరకాల కారణాలు చెప్పి మాత్రం తప్పించుకోవద్దు అని సూచించింది.












Click it and Unblock the Notifications