కశ్మీర్‌లో పట్టాలెక్కేందుకు రెడీ అవుతున్న వందేభారత్...
దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ప్రధాన నగరాలు, పట్టణాలను కలుపుతూ ఈ రైళ్లు నడుస్తున్నాయి. ఆధునాతన సదుపాయాలతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ వందేభారత్ రైళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికి వీటికి మంచి ఆదరణే లభిస్తుంది. తాజాగా కశ్మీర్‌లో పట్టాలెక్కేందుకు రెడి అవుతుంది వందేభారత్.. ఇదే విషయాన్ని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించడం జరిగింది.
త్రిపురలో కూడా ఈ రైళ్లు అందుబాటులోకి : ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోగా జమ్ము -శ్రీనగర్ లైన్‌లో వందేభారత్ రైళ్ల సర్వీస్‌లు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. ఇప్పటికే జమ్ము-శ్రీనగర్ రైల్వే లైను పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే కశ్మీర్‌తో పాటు మరో రాష్ట్రంలో కూడా ఈ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలోనూ సెమీ హై స్పీడ్ ట్రైన్స్‌ని నడిపే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి రైల్వే లైన్ కన్‌ఫమ్ కాగానే వెంటనే ఈ రైళ్లు పట్టాలపైకి ఎక్కుతాయని చెప్పారు.

2024 మార్చి నాటికి.. 75 వందేభారత్ : 2024 మార్చి నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 75 వందేభారత్ రైళ్లను నడపడమే లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. దీంతో పాటు రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లకి ప్రత్యామ్నాయంగా వందేభారత్ స్లీపర్ ట్రైన్స్‌నీ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. జమ్ము-శ్రీనగర్ రైల్వే లైన్ క్లియర్ అయిన వెంటనే వందేభారత్ రైళ్లు పరుగులు పెడతాయని స్పష్టం చేశారు అశ్విని వైష్ణవ్. ఈ ఆర్థిక సంవత్సరంలోగా ఈ ప్ర్రక్రియ పూర్తవుతుందని ఆయన అన్నారు. కశ్మీర్ వాతావరణానికి తగిన విధంగానే వందేభారత్ ట్రైన్స్‌ని రూపకల్పన చేస్తామని వైష్ణవ్ వెల్లడించారు. ఇప్పటికే దేశంలోని అన్ని వర్గాల వారికి ముఖ్యంగా యువత, వృద్ధులలో వందేభారత్ రైళ్లకి మంచి పాపులారిటీ లభించిందని ఆయన అన్నారు. అందుకే వీటి సంఖ్య కూడా పెంచే ఆలోచన చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications