Vande Bharat: వందే భారత్ కు సవాల్ విసురుతున్న బెస్ట్ రైళ్లు..! టాప్ ఫీచర్లు ఇవే..!

భారత్ లో ప్రస్తుతం ఎక్కడ చూసినా వందే భారత్ (vande bharat) రైళ్ల పేరు వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుతం దాదాపు 100కు పైగా వందే భారత్ లు పరుగులు తీస్తున్నాయి. తాజాగా వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఇక భవిష్యత్తు అంతా వందే భారత్ దే అన్న చర్చ సాగుతోంది. కానీ వందే భారత్ ల యుగంలోనూ అంతకంటే మెరుగైన ఫీచర్లు, సదుపాయాలు, వేగం, లగ్జరీతో ప్రయాణికుల ఆదరణ పొందుతున్న రైళ్లు ఉన్నాయి.

వందే భారత్ ను మించిన రైళ్లు

మన దేశంలో వందే భారత్ కు ఇప్పటికీ గట్టి పోటీ ఇస్తున్న రైళ్లలో ప్రధానంగా తేజస్ ఎక్స్‌ప్రెస్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్, రాజధాని ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, దురంతో ఎక్స్‌ప్రెస్, అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లు ఉన్నాయి. ఇవి ప్రయాణిస్తున్న మార్గాల్లో వందే భారత్ లతో పోలిస్తే ఇవి చౌక అయిన ప్రయాణాన్ని అందించడంతో పాటు మెరుగైన ఫీచర్లు కూడా కలిగి ఉన్నాయి. దీంతో వందే భారత్ లు వీటితో తప్పనిసరిగా పోటీ పడాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది.

Vande Bharat Rivals The Ultimate List of India s Top Trains by Popularity and Performance

వేగం, లగ్జరీతో ఆకట్టుకుంటున్న రైళ్లు

తేజస్ ఎక్స్ ప్రెస్ భారత్ లో అత్యంత వేగవంతమైన రైలుగా పేరు తెచ్చుకుంది. దీని గరిష్ట వేగం 200 కిలోమీటర్ల వరకూ ఉంది. అయితే ట్రాక్ ను బట్టి వేగాన్ని తగ్గించాల్సి వస్తోంది. ఇది పూర్తి ఏసీ రైలు, అత్యాధునిక సౌకర్యాలు, లగ్జరీ కోచ్ లు కలిగి ఉంది.
అలాగే ఢిల్లీ-ఆగ్రా మధ్య నడుపుతున్న గతిమాన్ ఎక్స్‌ప్రెస్ వేగం గంటకు 100 కిలోమీటర్లే అయినా ఈ మార్గంలో ఇదే అత్యధికం.
ఇందులో విమానాల తరహాలో హోస్టెస్ కూడా ఉంటారు. అలాగే ఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాలకు నడుపుతున్న రాజధాని ఎక్స్ ప్రెస్ న్యూ మోడల్స్ సైతం వాటి వేగం, లగ్జరీతో వందే భారత్ కు గట్టి పోటీనిస్తున్నాయి.

Vande Bharat Rivals The Ultimate List of India s Top Trains by Popularity and Performance

నాన్ స్టాప్ ప్రయాణాలు, చౌకగా టికెట్లు

భోపాల్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ పగటి పూట ప్రయాణాల్లో టాప్ గా నిలుస్తోంది. దీని వేగం గంటకు 100 కిలోమీటర్లే అయినా ఆహ్లాదకర ప్రయాణం ఉంటుందనే ఫీడ్ బ్యాక్ ఉంది. అలాగే దురంతో ఎక్స్ ప్రెస్ కూడా సూపర్ ఫాస్ట్, తక్కువ స్టాప్ లు ఉండటం వల్ల ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంది. ఇదే కోవలో తాజాగా కేంద్రం తీసుకువచ్చిన అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ లు సైతం బడ్జెట్ లో టికెట్ రేట్లతో లగ్జరీ ప్రయాణాన్ని అందిస్తూ ప్రయాణికుల్ని ఆకట్టుకుంటున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+