కాశీ విశ్వనాథ్ ఆలయం, జ్ఞాన్వాపి మసీదు కాంప్లెక్స్‌పై సర్వేకు ఏఎస్ఐకి కోర్టు అనుమతి
వారణాసి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి కోర్టు గురువారం కీలక తీర్పును వెలువరించింది. కాశీ విశ్వనాథ్ ఆలయం, జ్ఞాన్వాపి మసీదు కాంప్లెక్స్‌పై భారత పురవాస్తు శాఖ(ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా-ఏఎస్ఐ) అధ్యయనం చేసేందుకు కోర్టు అనుమతిచ్చింది.
ఈ అధ్యయనానికి అయ్యే ఖర్చును ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భరించాలని ఆదేశాలు జారీ చేసింది. జ్ఞాన్వాపి మసీదుకు చెందిన భూమిని హిందువులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసిన స్థానిక న్యాయవాది వి.ఎస్. రాస్తోగి దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.

1664లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్.. 2000 సంవత్సరాల పురాతన కాశీ విశ్వనాథ్ ఆలయంలో కొంత భాగాన్ని ఆక్రమించి మసీదును నిర్మించాడని పిటిషనర్ పేర్కొన్నారు. కాగా, ఈ పిటిషన్‌ను జ్ఞ్యాన్యపి మసీదు నిర్వహణ కమిటీ వ్యతిరేకించింది.
మసీదు కాంపౌండ్‌పై సర్వే చేయమని అభ్యర్థిస్తూ సివిల్ జడ్జి కోర్టులో స్వయంభు జ్యోతిర్లింగ భగవాన్ విశ్వేశ్వర్ తరఫున రాస్తోగి 2019 డిసెంబర్‌లో దరఖాస్తు చేశారు.
కాగా, ఈ పిటిషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అంజుమాన్ ఇంటెజామియా మసీదు కమిటీ కోర్టును ఆశ్రయించింది.
జ్ఞాన్వాపి మసీదులో పూజలు చేయడానికి అనుమతి కోరుతూ పిటిషన్ మొదటిసారిగా 1991 లో దాఖలైంది, కానీ, ఇది నిర్వహణ సామర్థ్యం మీద సవాలు చేయబడింది.
మతపరమైన ఆరాధన చట్టం 1991 ప్రకారం పిటిషన్‌ను కొనసాగించలేమని సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు, అంజుమాన్ ఇంటజామియా కమిటీ వాదించాయి.
కాశీ విశ్వనాథుడి ఆలయంలోని కొత భాగాన్ని అక్రమంగా ఆక్రమించిన ముస్లిం రాజులు మసీదును నిర్మించారని, ఆ ఆలయ స్థలాన్ని తిరిగి ఆలయానికే కేటాయించాలని ఇప్పటికే బీజేపీతోపాటు పలు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఆ మసీదుకు ఆలయ స్తంభాలు ఉండటమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications