కాబోయే రారాణి, ముచ్చటగా మూడోసారి చాన్స్ వస్తుందా ?, రాజస్థాన్ లో వసుంధర రాజే హవా !
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించి అధికారంలోకి రావాలని బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. బీజేపీ నాయకురాలు, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఝల్రాపటన్ నుండి ఆధిక్యంలో ఉన్నారు. వసుంధర రాజేకి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన రామ్‌లాల్ చౌహాన్ సవాల్ చేస్తున్నారు. అయితే వసుంధ రాజే మాత్రం ఆమె సత్తా చాటుకుంటున్నారు.
వంసుధ రాజే 2003 నుండి ఝలావర్ జిల్లాలోని ఝల్రాపతన్ అసెంబ్లీ సీటును గెలుస్తూ ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలను సవాల్‌గా తీసుకున్న వసుంధర రాజే మళ్లీ సీఎం కావావలని ఆ కుర్చీని ఆశిస్తున్నారు. 2018లో వసుంధర రాజే ప్రభుత్వానికి ప్రజలు ఓటు వేయబడినప్పటి నుండి ఆమె కొంతకాలం మౌనం వహించారు. బీజేపీ కార్యక్రమాల నుండి వసుంధ రాజే కొంతకాలం తప్పుకున్నారు.

ముఖ్యంగా సతీష్ పూనియా 2019 నుండి 2023 ప్రారంభంలో రాజస్థాన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వసుంధర రాజే విధేయులు బీజేపీ కార్యక్రమాల నుంచి పక్కకు తప్పుకోవడంతో ఇంతకాలం ఆమె భవిష్యత్తు కూడా అనిశ్చితంగా అనిపించింది. హోరాహోరీగా సాగుతున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కొన్ని నియోజక వర్గాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలోకి వచ్చినా తరువాత బీజేపీ పుంజుకుంది.

రాజస్థాన్ లో మొత్తం 199 అసెంబ్లీ స్థానాలు న్నాయి. బీజేపీ 107 చోట్ల, కాంగ్రెస్ 75 చోట్ల ముందంజలో కొనసాగుతున్నాయి. ఇతరులు 17 చోట్ల మందంజలో ఉన్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలన్నా మెజారిటీ మార్కు 100కు చేరుకోవాలి. 2023 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో 74.96% ఓటింగ్ నమోదైంది, ఇది 2018 అసెంబ్లీ ఎన్నికల గణాంకాలను కొద్దిగా ఎక్కువగానే ఉంది.
రాజస్థాన్ లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వస్తే వసంధర రాజే మూడోసారి ముఖ్యమంత్రి కావాలని ఆశపడుతున్నారు. అయితే బీజేపీ హైకమాండ్ వసుంధర రాజేకి మరో చాన్స్ ఇస్తారా ? కొత్తగా ఎవరినైనా తెరమీదకు తెస్తారా ? అనే విషయం వేచి చూడాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తం మీద రాజస్థాన్ లో కాబోయే రాజు, రాణి ఎవరు అని ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications