Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రంగంలోకి రాజే: రాజస్తాన్ రాజకీయాల్లో కీలక మలుపు, కమలదళ పెద్దలతో వసుంధర భేటీ, పైలట్‌తో చర్చలు..?

రాజస్తాన్‌లో అశోక్ గెహ్లట్ ప్రభుత్వంలో అస్థిరత్వం సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. రెండోరోజు సీఎల్పీ భేటీకి డుమ్మా కొట్టడంతో సచిన్ పైలట్ సహా ఇద్దరు మంత్రులపై కాంగ్రెస్ పార్టీ వేటువేసింది. మరోవైపు సచిన్ బీజేపీతో చేతులు కలుపకుండా కొత్త పార్టీ పెడతానని ప్రకటించబోతున్నారు. ఈ క్రమంలో ఫైర్ బ్రాండ్ వసుంధర రాజే ఎంట్రీ ఇవ్వబోతున్నారు. రాజస్తాన్ కాంగ్రెస్‌లో నెలకొన్న అనిశ్చితిని గత నాలుగు రోజులుగా పరిశీలిస్తోన్న రాజే.. ఇవాళ ఢిల్లీలో కమలదళ పెద్దలతో భేటీ కాబోతున్నారు. వసుంధర రాజే ఆగమనంతో రాజస్తాన్ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయనే చర్చ సర్వత్రా జరుగుతోంది.

రాజే కీ రోల్..

రాజే కీ రోల్..

వాస్తవానికి గెహ్లట్ ప్రభుత్వం విశ్వాసం కోల్పోతే ప్రతిపక్ష బీజేపీ బలం నిరూపించుకోవాలని గవర్నర్ పిలుస్తారు. అయితే బీజేఎల్పీ నేత మాత్రం వసుంధర రాజేనే.. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ మాదిరిగా రాజే సీఎం పదవీ చేపట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ఇన్నాళ్లు పరిస్థితులను గమనించిన బీజేపీ కూడా.. రాజేతో సంప్రదింపులు జరపకుండా ఎలాంటి ముందడుగు వేయలేదు.

ఫెయిల్యూర్..

ఫెయిల్యూర్..

సచిన్ పైలట్‌తో పలుమార్లు డిస్కషన్స్ జరిగినా.. అవీ సఫలం కాలేదు. ఈ క్రమంలో రాజే ఎంట్రీతో.. పైలట్‌ను కాంప్రమైజ్ చేస్తారని కమలదళం భావిస్తోంది. దీనికితోడు పైలట్‌తో చర్చలు జరిపే సమయంలో కూడా బీజేపీ ఆచి తూచి స్పందించింది. రాజేకు చెప్పకుండా నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఉండటంతో.. ఆ డిస్కషన్స్ సక్సెస్ కాలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

సీఎం పోస్టు..?

సీఎం పోస్టు..?

వాస్తవానికి పైలట్‌తో బీజేపీ నేతలు చర్చలు జరిపారు. కానీ ఆయన తనకు సీఎం పోస్టు ఇవ్వాలని అడిగినట్టు తెలుస్తోంది. పరిమిత సీట్లతో వస్తోన్న నేతకు సీఎం పదవీ ఇచ్చేందుకు కమలదళం సాహసం చేయలేదు. దీంతో ఆ చర్చలు అక్కడే ఆగిపోయాయి. ఒకవేళ నిర్ణయం తీసుకోవాలన్న రాజేకు తప్పనిసరి చెప్పాల్సింది. ఎందుకంటే బీజేపీ 73 మంది ఎమ్మెల్యేల్లో 45 మందికి పైగా ఎమ్మెల్యేలు ఇప్పటికీ రాజే మద్దతుదారులే. అందుకోసమే సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఓం మాథుర్ స్వయంగా రాజస్తాన్ వెళ్లి రాజేతో చర్చలు జరిపారు. బుధవారం ఢిల్లీలో జరిగే సమావేశానికి రావాలని కోరారు.

తగ్గుతోన్న సంఖ్య..

తగ్గుతోన్న సంఖ్య..

పైలట్ తిరుగుబాటుతో గెహ్లట్ సర్కార్ మద్దతు తగ్గిపోతోంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఆశలు చిగురించాయి. అందుకోసమే వేగంగా కమలదళం పావులు కదుపుతోంది. అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని గెహ్లట్‌ను డిమాండ్ చేస్తోంది. అతని ప్రభుత్వం మైనారిటీలో ఉంది అని పేర్కొన్నది. అదే సమయంలో రాజేతో సంప్రదింపులు జరుపుతోంది.

Recommended Video

    Rajasthan Political Crisis : వేడెక్కిన రాజస్తాన్ రాజకీయం..పూర్తి మద్దతు Ashok Gehlotకే ..!
     73+18

    73+18

    73 వరకు సభ్యులు ఉన్నందున.. పైలట్ వర్గం 18 మందిని కలిపితే 91 వరకు అవుతోంది. స్వతంత్ర అభ్యర్థులతో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అయితే పైలట్‌తో చర్చలు ఇక్కడ కీలకం కాగా.. రాజే, పైలట్ ఎవరూ సీఎం పదవీ చేపడుతారనే అంశం కూడా మరింత ముఖ్యమైంది. టాప్ పోస్ట్‌పై చర్చలు సానుకూలంగా జరిగితో రాజే పైలట్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+