పొలిటికల్ రిటైర్మెంట్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన వసుంధర రాజే..

రాజస్థాన్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకురాలు వసుంధర రాజే త‌న రాజ‌కీయ ముగింపు గురించి కీలక వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఝలావర్‌లో శుక్రవారం నిర్వహించిన ఓ బ‌హిరంగ స‌భ‌లో వ‌సుంధర రాజే పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ త‌న పొలిటిక‌ల్ రిటైర్మెంట్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.త నకు రాజకీయాలను నుంచి తప్పుకోవాలని అనిపిస్తోందని, రాజే త‌న మనసులోని మాటను ఈ సంద‌ర్భంగా బయటపెట్టారు. అయితే ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్ ప్ర‌సంగం అనంత‌రం ఆమె ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

కుమారుడి స్పీచ్ అనంత‌రం: ఈ బ‌హిరంగ స‌భ‌లో ముందుగా దుష్యంత్ సింగ్ మాట్లాడారు. దుష్య‌త్ సింగ్ ఝలావర్-బరన్ కు నియోజకవర్గం నుంచి లోక్‌స‌భ‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, కొడుకు ప్ర‌సంగం అనంత‌రం త‌ల్లి వసుంధర రాజే మాట్లాడుతూ.. నా కొడుకు మాటలు విన్న తరువాత మీరందరూ అతడికి చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చిన‌ట్లు అనిపిస్తోంది. కాబట్టి ఇక నేను నిశ్చింతగా రిటైర్ అవ్వొచ్చ‌ని అనిపిస్తుంది. ఇక అతడికి నేను దిశానిర్దేశం చేయాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. ఎమ్మెల్యేలందరూ ఇక్కడే ఉన్నారు. వారిపై పర్యవేక్షణ అవసరం లేకుండానే ప్రజల కోసం కష్టించి పనిచేస్తున్నారు'' అని రాజే వ్యాఖ్యానించారు.

 Vasundhara Raje who made comments on political retirement

బిజెపిని ముందుకు తీసుకెళ్లేందుకు ప్ర‌జలు కృషి చేయాలి: కుమారుడు దుష్యంత్ సింగ్ రాజే ప్రసంగం విని వసుంధర రాజే ఎంత‌గానో మురిసిపోయారు. దుష్యంత సింగ్ ప్రజాప్రతినిధిగా ప్రజల మన్ననలు పొందుతున్న తీరును చూసి ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలందరూ ఇక్కడే ఉన్నారు. ఎవరంతట వారే ప్రజల కోసం పని చేస్తున్నారని ఆమె చెప్పారు. ఝలావర్‌లోని మౌళిక స‌దుపాయాలు... రోడ్లు, నీటి సరఫరా ప్రాజెక్టులు, వాయు, రైలు కనెక్టివిటీ గురించి రాజే స‌భ‌లో ప్ర‌స్తావించారు. గత మూడు దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి రాజే ఒక్కొక్క‌టిగా చెప్పుకొచ్చారు.

 Vasundhara Raje who made comments on political retirement

బిజెపి పార్టీని ముందుకు తీసుకేళ్లేందుకు ప్రజలు కృషి చేసినప్పుడే మ‌ళ్లీ రాజస్థాన్ నంబర్ వన్ రాష్ట్రంగా మారుతుందని ఈ సంద‌ర్భంగా వసుంధర రాజే అన్నారు. రాజస్థాన్ అసెంబ్లీలో మొత్తం 200 స్థానాలున్నాయి. న‌వంబ‌ర్ 25వ తేదీన ఈ ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రగనున్నాయి. ఈ సంద‌ర్భంగా ఝలావర్ నియోజకవర్గం నుంచి రాజే నేడు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+