Veerappan: లోక్ సభ బరిలో వీరప్పన్ కుమార్తె..

వీరప్పన్.. రెండు రాష్ట్రాలను గడగడలాడించిన స్మగ్లర్. అతను గంధపు చెక్కలను స్మిగ్లింగ్ చేసేవాడు. అతన్ని ఎట్టకేలకు ఎన్ కౌంటర్ లో మట్టుబెట్టారు. వీరప్పన్ గురించి చాలా సినిమాలు వచ్చాయి. అయితే వీరప్పన్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. వీరప్పన్ రెండో కుమార్తె విద్యా రాణి వీరప్పన్ ఈ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. విద్యా రాణి తమిళనాడులోని కృష్ణగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్ల ప్రకటించారు.

విద్యారాణి 2020లో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆమె రాష్ట్ర యువజన విభాగానికి ఉపాధ్యక్షురాలిగా పని చేశారు. ఆమె తాజాగా నామ్ తమిళర్ కట్చి (ఎన్‌టీకే)లో చేరారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో నామ్ తమిళర్ కట్చి పార్టీ తమిళనాడులోని 39 లోక్ సభ స్థానాలతో పాటు పుదుచ్చేరి స్థానంలో కూడా పోటీ చేస్తుంది. విద్యా రాణి మూడో తరగతి చదువుతున్న సమయంలో తమిళనాడు, కర్ణాటక సరిహద్దులోని గోపీనాథమ్‌ గ్రామంలోని తాతయ్య ఇంట్లో తన తండ్రి వీరప్పన్‌ను కలిసినట్లు చెప్పారు.

Veerappan s daughter will contest the Lok Sabha elections

తను వీరప్పన్‌ను కలవడం అదే మొదటి సారే కాదు చివరి సారి అని విద్యా రాణి భావోద్వేగానికి గురయ్యారు. విద్యా వాణివృత్తిరీత్యా న్యాయవాది. అంతే కాకుండా ఆమె కృష్ణగిరిలో ఒక పాఠశాలను కూడా నడుపుతున్నారు. తన తండ్రి వీరప్పన్ కలిసినప్పుడు జీవితానికి కొత్త దిశానిర్దేశం చేశారని విద్యా రాణి చెప్పారు. ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో చాలా మంది సెలబ్రిటీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు బీజేపీ టికెట్ ఇచ్చింది.

ప్రజలకు సేవ చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని తెలిపారు. ఆమె తన స్వస్థలమైన హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీ నుంచి బీజేపీ టికెట్‌పై పోటీచేయబోతున్నట్లు ప్రకటించారు. బీజేపీలో చేరడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+