కూడళ్లు ఫుల్: చెన్నైకి జగన్, జపాన్ రాణి టూర్ ఇక్కట్లు
చెన్నై: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితోపాటు జపానీస్ రాయల్స్ తమిళనాడు రాజధానికి చెన్నై వచ్చిన కారణంగా నగర ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్ర సమైక్యత ప్రయత్నాల్లో భాగంగా జగన్ బుధవారం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిలను కలిసిన విషయం తెలిసిందే.
జయలలితతో జగన్ భేటీ నేపథ్యంలో చెన్నై విమానాశ్రయం నుండి అల్వార్‌పేటలోని పోయెస్ గార్డెన్ వరకు దాదాపు మూడు గంటల పాటు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. జగన్ కాన్వాయ్‌లో నలభై కార్లు, సెక్యూరిటీ పర్సనల్స్ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో జగన్‌ను చూసేందుకు భారీగా రోడ్ల కూడళ్లకు మద్దతుదారులు, ప్రజలు చేరుకోవడం మరింత ఇబ్బందులు తెచ్చిపెట్టింది.

టి నగర్, అన్నా సలాయి, సైదాపేట్, నందనం తదితర ప్రాంతాల్లో అభిమానులు జగన్‌ను చూసేందుకు తరలి వచ్చారు. చామియర్స్ రోడ్డు పైన ట్రాఫిక్ దాదాపు రెండు గంటలు నిలిచిపోయింది. జగన్‌ను చూసేందుకు గుంపులుగా వచ్చారని, అయినా ట్రాఫిక్‌కు పెద్ద ఇబ్బందులు తలెత్తలేదన్నారు.
జగన్‌తో పాటు జపనీస్ రాయల్స్ రావడం చెన్నై ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జపనీస్ ఎంపరర్ అకిహిటో, ఎంప్రెస్ మిచికా చెన్నై నగరానికి వచ్చారు. జగన్, జపనీస్ రాయల్స్ వల్ల సాయంత్రం వరకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి.












Click it and Unblock the Notifications