వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంట్లో చర్చించకుండానా?: మోడీకి వెంకయ్య షాక్! సర్దిచెప్పారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పలు సంస్కరణలు, ఇతర నిర్ణయాల కోసం ఆర్డినెన్స్ తీసుకు రావాలన్న కేంద్రమంత్రివర్గ నిర్ణయాన్ని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తొలుత వ్యతిరేకించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆర్డినెన్స్ తీసుకు వచ్చే విషయమై ఇటీవల కేబినెట్ భేటీ జరిగిన విషయం తెలిసిందే.

పార్లమెంటులో చర్చ లేకుండానే ఆర్టినెన్స్ తీసుకు రావడం ద్వారా సంస్కరణలు అమలు చేయాలని నరేంద్ర మోడీ సర్కారు నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారని సమాచారం. ఆర్డినెన్స్ జారీ సమయంలో వెంకయ్య నాయుడు ఇది తగదని కేబినెట్లో సూటిగా చెప్పారని తెలుస్తోంది.

Venkaiah Naidu opposed ordinance, sparked debate during Cabinet meet

సోమవారం నాడు కేబినెట్ భేటీ జరిగింది. ఐరన్ ఓర్, ఇతర ఖనిజాల వేలం పైన ఆర్డినెన్స్ తీసుకు వచ్చే విషయమై చర్చించారు. సుప్రీం కోర్డు రద్దు చేసిన కోల్ బ్లాక్స్‌ను వేలం వేయాలని కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చే విషయమై చర్చించింది.

అయితే, దీని పైన వెంకయ్య కేబినెట్ సమావేశంలో మాట్లాడుతూ.. పార్లమెంటు సమావేశాల వరకు ఆగటమే మంచిదని చెప్పినట్లగా తెలుస్తోంది. ఆర్డినెన్స్ కంటే పార్లమెంటులో చర్చిస్తేనే మంచిదని చెప్పారని తెలుస్తోంది. కీలక నిర్ణయాలు పార్లమెంటులో చర్చించాకే అమలు చేయాలని వెంకయ్య చెప్పగా, దీంతో మోడీ సహా, మిగతా మంత్రులు ఆశ్చర్యపోయినట్లుగా తెలుస్తోంది.

English summary
The Cabinet recently discussed the utility of adopting the ordinance route to push reforms and other decisions instead of waiting for Parliament to convene before Prime Minister Narendra Modi settled the matter with a brief interjection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X