వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిగ్గజ బాలీవుడ్ నటుడు రిషికపూర్ కన్నుమూత, శోకసంద్రంలో బాలీవుడ్, బిగ్ బీ దిగ్భ్రాంతి..

|
Google Oneindia TeluguNews

బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషికపూర్ (67) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం ముంబైలో చనిపోయారు. అస్వస్థతకు గురవడంతో బుధవారం ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చేర్చించామని సోదరుడు రధిర్ కపూర్ తెలిపారు. రిషికపూర్ ఉదయం 8.45 గంటలకు చనిపోయారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన గత రెండేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారని వెల్లడించారు.

Recommended Video

Bollywood Legend Rishi Kapoor Passes Away
క్యాన్సర్‌ వ్యాధితో..

క్యాన్సర్‌ వ్యాధితో..

అమెరికాలో క్యాన్సర్ చికిత్స తర్వాత గతేడాది సెప్టెంబర్‌లో రిషి కపూర్ ఇండియా తిరిగొచ్చారు. ఇక్కడికొచ్చాక కూడా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో అనారోగ్యం కారణంగా రెండుసార్లు ఆసుపత్రిలో చేరారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రిషి కపూర్ చివరిసారిగా ఏప్రిల్ 2న ట్విట్టర్‌లో ఒక పోస్టు పెట్టారు. తన ఆరోగ్యం పట్ల కుటుంబం,అభిమానులు,స్నేహితులు చూపుతున్న శ్రద్దకు తాను చాలా సంతోషిస్తున్నానని అందులో తెలిపారు. కానీ ఇంతలోనే అతనిని మృత్యువు కబళించింది.

బాలీవుడ్ షాక్...

బాలీవుడ్ షాక్...

రిషికపూర్ చనిపోయారని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ధృవీకరించారు. తొలుత ఆయనే ట్వీట్ చేశారు. అతని మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. రిషికపూర్ మృతితో బాలీవుడ్ షాక్‌నకు గురైంది. ‘ద బాడీ' పేరుతో నెట్ ప్లిక్స్ వెబ్ సిరీస్‌లో రిషీకపూర్ చివరగా నటించారు. నటుడిగానే కాక దర్శకుడు, నిర్మాతగా కూడా మంచి పేరు గాడించారు. ఆర్కే ఫిల్మ్స్ పేరుతో సినిమాలను నిర్మించారు.

 రాజ్ కపూర్ కుమారుడు..

రాజ్ కపూర్ కుమారుడు..

ప్రముఖ నటుడు రాజ్ కపూర్ చిన్నకుమారుడు రిషికపూర్. ఇతనికి భార్య నీతుకపూర్, కుమారుడు రణబీర్ కపూర్, కూతురు రుధిమ కపూర్ ఉన్నారు. ‘మేరా నామ్ జోకర్' సినిమాలో రాజ్ కపూర్ హీరో కాగా.. కుమారుడు రిషి కపూర్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చారు. 1970లో జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. 1973లో బాబీ సినిమాతో బాలీవుడ్‌లో తెరంగ్రేటం చేశాడు. ఆ మరుసటి ఏడాది ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు.

సినిమాలు, అవార్డులు

సినిమాలు, అవార్డులు

1973 నుంచి 2000 వరకు తీసిన 92 సినిమాలు కూడా రొమాంటిక్ సినిమాలే కావడం విశేషం. వాటిలో 36 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. 1973 నుంచి 1981 వరకు 12 సినిమాలు తన భార్య నీతుకపూర్‌తో చేయడం విశేషం. 40కి పైగా మల్టీస్టార్ మూవీస్‌లో నటించి మెప్పించారు. బాబీ, చాందినీ, లైలా మజ్ను లాంటి హిట్ సినిమాల్లో నటించడం కాదు జీవించారు. 2008లో ఫిల్మ్ ఫేర్ లైప్ టైం అచీవ్ మెంట్ అవార్డుతో వరించింది. ‘దో డూని చార్' సినిమాలో నటనకు గాను 2011లో ఫిల్మ్ ఫేర్ క్రిటిక్స్ అవార్డు, కపూర్ అండ్ సన్స్‌ సినిమాకు 2017లో ఉత్తమ సహాయ నటుడి అవార్డును అందుకున్నారు.

English summary
actor Rishi Kapoor has dead in Mumbai hospital, his elder brother Randhir Kapoor said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X